చెట్టుపైనే హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి కరోనా నెగిటివ్‌!..

కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తుంది. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకునే వారు కొందరు ఉంటే వచ్చిన వారు తమ కుటుంబసభ్యులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు చెట్టుపైన మరికొందరు రోడ్లపై ఇంకా కొందరైతే బాత్రుంల్లో కూడ ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసుకుని ఇలా తనకు సోకిన కరోనా ఇతరులకు ,ముఖ్యంగా కుటుంబసభ్యులకు సోకకూడదనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి చెట్టుపైనే హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. న‌ల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండకు చెందిన శివకు కరోనా సోకింది. ఐసోలేషన్ లో ఉండాలని డాక్టర్లు చెప్పారు. పేదవాళ్ళు కావడం అతడి ఇంట్లో ఉన్నది ఒక్కటే రూము కావడంతో ఐసోలేషన్ లో ఎలా ఉండాలి అనే ప్రశ్న అతడిని వెంటాడింది. ఇంటి ముందున్న చెట్టు గుర్తుకు రావడంతో దాన్ని ఐసోలేషన్ రూమ్ గా మార్చుకున్నాడు. చెట్టుపై మంచం కట్టాడు. అక్క‌డే భోజ‌నం నిద్ర అన్నీ కానిచ్చేశాడు.

Shivaఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అధికారులు వెంట‌నే అత‌డిని మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన హోం ఐసోలేష‌న్ కేంద్రానికి త‌ర‌లించారు. అత‌డికి నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో క‌రోనా నెగిటివ్‌గా వ‌చ్చింది. ఎంపీపీ బాలాజీ, సర్పంచి కొత్త మరెడ్డి, ఎస్సై వీరశేఖర్‌, మండల వైద్యాధికారి డాక్టర్‌ ఉపేందర్‌, వైస్‌ఎంపీపీ కూరాకుల మల్లేశ్వరి గోపీనాధ్‌ తదితరులు సోమవారం అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. ట్రీ ఐసోలేషన్‌‌తో కరోనాను జయించిన అత‌డు ప్ర‌స్తుతం ఎంతో మందికి మార్గదర్శి.