‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ ఈ వారం నామినేషన్స్‌ లిస్ట్‌..

biggboss nominations

‘బిగ్‌‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌ మొత్తం యానీ మాస్టర్‌ ఎలిమినేషన్‌ తో కాస్త డీలా పడ్డారు. అందరూ అనుకున్నట్లుగానే యానీ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయిపోయింది. కొంత ఆమె వింత ప్రవర్తన కూడా ఆమె ఎలిమినేషన్‌ కు కారణం అయ్యిందనే చెప్పాలి. అప్పటి వరకు కాస్తో కూస్తో నెగెటివ్‌ ఉన్న కాజల్‌ పై సింపథీ వచ్చేలా చేశాయి యానీ మాస్టర్‌ చర్యలు. ప్రేక్షకులు సైతం ఆమె అలా చేయడం తీసుకోలేక పోయారు. అందుకే యానీ మాస్టర్‌ 11 వారాలు ఇంట్లో ఉండి వెళ్లిపోయారు. బిగ్‌ బాస్‌ లో రానురాను కంపిటీషన్‌ పెరిగిపోతోంది. ఇప్పుడు హౌస్‌ లో 4: 4 గ్రూపులు అయ్యాయి. ప్రియాంక, సన్నీ, మానస్‌, కాజల్‌ ఒక టీమ్‌ శ్రీరామ్‌, షణ్ముఖ్‌, రవి, సిరి ఒక టీమ్‌ అనమాట. ఇక నుంచి ఆట ఇంకాస్త ఆసక్తిగా మారబోతోంది.

biggboss nominationsఈ వారం నామినేషన్స్‌..

ఇక మన్‌ డే అంటే బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఫన్‌ డే. నామినేషన్స్‌ లో రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సారి నామినేషన్‌ తీరు కూడా ఆసక్తిగా ఉంది. ప్రతి సీజన్‌ లో ఉండేదే. ఒక దిష్టి బొమ్మ పెట్టి దానికి ఒక కుండ పెట్టి పగల కొట్టాలి. అంటే నీకు ఇష్టం లేని వ్యక్తిని దాదాపు అతని బుర్ర పగలగొట్టినట్లే అనమాట. గత మూడు వారాలుగా చెప్పుకుంటున్నట్లు. ఈ వారం కూడా నామినేషన్స్‌ లో ఒక్క కెప్టెన్‌ మినహా అందరూ ఉన్నారు. అవును.. కెప్టెన్‌ మానస్‌ మినహా మిగిలిన ఏడుగురు నామినేషన్స్‌ లో ఉన్నారన మాట. ఆ లెక్కన ఇక ప్రతివారం ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. నామినేషన్స్‌లో ఉండకూడదు అంటే ఆ వ్యక్తి కెప్టెన్‌ అవ్వాలి అనమాట. వారాలు గడుస్తున్న కొద్దీ బిగ్‌ బాస్‌ హౌస్‌ లో గేమ్‌ చాలా ఇంట్రస్టింగ్‌ గా మారుతోంది.