‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఎప్పుడు చెప్తునట్లుగానే బాగా ట్విస్టులతో ప్లాన్ చేశారు. ప్రతి ఎపిసోడ్, ప్రతివారం, ప్రతి ఎలిమినేషన్‌ను ఒక క్లైమాక్స్‌లా ప్లాన్ చేస్తున్నారు. ఫ్రెండ్‌షిప్, గొడవలు, గిల్లిగజ్జాలు, నామినేషన్స్, కన్నీటిపర్యంతాలు ఇలా ఒకటా రెండా ఎన్నో ఎమోషన్స్, డ్రామాలతో కొనసాగుతోంది ‘బిగ్‌బాస్ 5 తెలుగు’. తాజాగా నడిచిన లహరి, రవి, ప్రియల వివాదాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. తప్పు ఎవరిది అని పెద్దగా చర్చ జరిగింది. దానికి సంబంధించి శనివారం ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున పిచ్చ క్లారిటీ ఇచ్చేశాడు. రవిది తప్పు అని.. ఆమె లేనప్పుడు వెనక మాట్లాడుతున్నాడని లహరి తెలుసుకుంది. వెంటనే అందరినీ రిక్వెస్ట్ చేసింది మనిషి లేనప్పుడు వెనక మాట్లాడొద్దు అని. నాగార్జున ఇచ్చిన క్లారిటీతో లహరి వెళ్లి ప్రియను హగ్ చేసుకుంటుంది. రవిని అలా ఎందుకు మాట్లాడావు అంటూ క్వశ్చన్ చేస్తుంది. ఈ వారం మొత్తంలో ఇదే బాగా హైలెట్ అయిన ఇష్యూ కూడా.
నామినేషన్స్‌లో ఉన్న లహరి కచ్చితంగా సేవ్ అవుతుందని అందరూ భావించారు. ఈసారి హౌస్ నుంచి ప్రియ బయటకు వెళ్తుందని అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ అలా అనుకోలేదు. ఈ వారం హౌస్ నుంచి లహరి షేరీ ఎలిమినేట్ అయ్యింది. రవి, ప్రియలతో గొడవ తర్వాత ప్రియ నెగెటివ్ మోడ్‌లో కనిపించడంతో అందరూ నటి ప్రియనే ఈ వారం ఎలిమినేట్ అనుకున్నారు. రవి గురించి నిజం తెలుసుకున్న లహరి హౌస్‌లో ఉంటే రవితో ఇంకా మంచి కంటెంట్ వస్తుందని ప్రేక్షకులు భావించారు. కానీ, వారి ఆశలు అడిఆశలయ్యేలా లహరి షేరీ ఎలిమినేట్ అయ్యింది. అందుకు అభిమానులు కూడా ఒకింత బాధపడ్డారు. ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ జరిగినట్లు క్లారిటీ ఇచ్చారు. ఓటింగ్ పరంగా లహరి షేరీ అందరికంటే లీస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే లహరి బిగ్‌బాస్‌కు వచ్చే వరకు కూడా అంత పేరున్న ఆమె కాదు. అందరికీ సుపరిచితురాలు కాదు కాబట్టి అలా జరిగిందని భావిస్తున్నారు. ఉన్న అన్ని రోజులు బాగా పర్ఫార్మ్ చేసింది. లహరి ఔట్ అయినా కూడా రవికి మాత్రం నటి ప్రియతో అంత మంచిగా ఉంటుందని అనుకోవట్లేదు ప్రేక్షకులు. లహరి- రవి కంటెంట్‌కి బదులు ప్రియ-రవి ఎపిసోడ్స్ కచ్చితంగా ఎంటర్‌టైనింగ్ ఉంటాయని భావిస్తున్నారు.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్‌డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.