బిగ్ బాస్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలిసి అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఎలిమినేషన్ గురించి పెద్ద డిస్కషన్ నడుస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇనయా.. బిగ్ బాస్ 6 విన్నర్ లేదంటే రన్నర్ అవుతుందని ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరూ ఫిక్సయ్యారు. అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ నుంచి ఆమెని ఈ వారం సైడ్ చేశారని సమాచారం. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న ఇనయాని హౌస్ నుంచి బయటకు ఎందుకు పంపిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ వారం నామినేషన్స్ లో రేవంత్, కీర్తి, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఇనయా, రోహిత్ ఉన్నారు. శ్రీహాన్ కు టికెట్ టూ ఫినాలే రావడంతో అతడికి నామినేషన్స్ నుంచి మినహాయింపు దొరికింది. అలానే ఫైనల్ లో అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ గానూ నిలిచాడు. అలానే ఈ సీజన్ ప్రారంభం నుంచి సింగిల్ గానే పోరాడుతూ వచ్చిన ఇనయా.. హౌసులోని ప్రతి ఒక్కరికీ టఫ్ ఫైట్ ఇచ్చింది. ఇక ఈ వారం కూడా ఓటింగ్ లో ఏ పోల్ చూసుకున్నా సరే టాప్-3లోనే ఉంది. ఇవన్నీ పక్కనబెడితే బిగ్ బాస్ ఆర్గనైజర్స్ మాత్రం ఇనయాని ఎలిమినేట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అనధికారిక పోల్ లెక్కల ప్రకారం రేవంత్, రోహిత్ తొలి రెండు ప్లేసుల్లో ఉండగా, ఇనయా మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆదిరెడ్డి, శ్రీసత్య, కీర్తి వరసగా ఉన్నారు. దీని ప్రకారం చూసుకుంటే ఈ వారం కీర్తి ఎలిమినేట్ కావాల్సి ఉంది.
కానీ హౌస్ నుంచి బయటకెళ్లేది ఆమె కాదని, ఇనయాని టాక్ వినిపిస్తోంది. తొలి రెండు మూడు వారాలు కాస్త డల్ గా కనిపించిన ఇనయా.. ఆ తర్వాత నుంచి ప్రతి టాస్కులోనూ రెచ్చిపోయింది. ఫిజికల్ టాస్కుల్లోనూ మేల్ కంటెస్టెంట్స్ కు గట్టిపోటీ ఇస్తూ ఆటలో దూసుకెళ్లింది. ఒకానొక టైంలో రేవంత్ ని పక్కకునెట్టి.. ఓటింగ్ విషయంలో కొన్ని వారాలు టాప్ లో నిలిచింది. బిగ్ బాస్ 6 ని ఆడియెన్స్ ఈ మాత్రమైనా సరే ఇష్టపడటంలో ఇనయా రోల్ కూడా ఉంది. మిగతా కంటెస్టెంట్స్ పెద్దగా గేమ్స్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయనప్పటికీ.. ఇనయా మాత్రం ఫుల్ దూకుడు చూపించేది. అలాంటి ఆమెని ఇప్పుడు బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. షో చూసేవాళ్లు మాత్రం.. ఇనయా ఫైనల్ వరకు ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఈ ఎలిమినేషన్ లో నిజమెంత అనేది తెలియాలంటే మాత్రం వీకెండ్ ఎపిసోడ్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఇనయా ఎలిమినేట్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.