మెుదటి నంచి కూడా సుధాకర్-చిరంజీవిలు మంచి స్నేహితులు కావడంతో.. ఇంకా వీళ్లిద్దరి మధ్య ఈ రోజు వరకు మంచి రిలేషన్ ఉంది. అయితే ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి తన స్నేహితుడు సుధాకర్ కొడుకు బాధ్యతని తీసుకోవడం విశేషం.
నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఓక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం.. ఇలాంటి రోగాల బారిన పడకుండా.. తెలుగు ప్రేక్షకుల్ని తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించేవాడే నటుడు బేత సుధాకర్. ఈ పేరు ఇప్పుడున్న తరానికి అంతగా తెలియకపోవచ్చు కానీ.. అప్పట్లో ఇరవై ఏళ్ల క్రితం తెలుగు సినిమాలను రెగ్యూలర్ గా చూసినవాళ్లకు మాత్రం పరిచయం చేయావల్సిన అవసరమే లేదు. అబ్బబ్బ.. అంటూ తన దైన పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే గొప్ప కమేడియన్ ఎవరన్నా ఉన్నారంటే.. అది మన బేత సుధాకర్. తను తమిళ్ లో హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. కానీ తెలుగులో మాత్రం కమెడీయన్ గా అంకింతం అయిపోయాడు.
2000 సంవత్సరం వరకు బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా కొనసాగాడు. అప్పట్లో తెలుగు మూవీ 2005 సంవత్సరంలో సంక్రాంతి సినిమాలో నటించాడు. ఇక ఆ తర్వాత నుంచి టాలివుడ్ సినిమాల్లో నటించడం ఆపివేసాడు. అలా కొన్ని రోజుల నుంచి అనారోగ్యం కారణంగా పూర్తిగా సినిమాఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. సుధాకర్ కొడుకు బెనెడిక్ మైఖేల్ ఇండస్ట్రీలోకి రావాలని తెగ ఆసక్తి చూపుతున్నాడు. కానీ కొన్నిఇతర కారణాల వల్ల ఇప్పటి వరకు ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అతి త్వరలోనే నా వారసుడు టాలీవుడ్ లో సినిమా చేయబోతుననట్లు సుధాకర్ తెలిపాడు. తాజాగా సుధాకర్ ఓ టీవి ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వెళ్లాడు. తన వారసుడి ఇండస్ట్రీ ఎంట్రీ అంతా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా జరుగుతుందని తెలియజేసాడు.
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్ చాలా మంచి స్నేహితులు. ఓకప్పుడు చెన్నై లో ఉంటున్నా వీళ్లిద్దరు ఒకే దగ్గర కలిసి ఉండేవారు. చిరంజీవి కంటే ముందు కూడా సుధాకర్ హీరోగా మారి సినిమాల్లో నటించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత చిరంజీవికి సినిమా అవకాశాలు రావడం.. వరసగా సూపర్ హిట్లు అందుకోవడం.. ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకే చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదిగిపోయాడు. ఇక సుధాకర్ మాత్రం కమెడీయన్ గానే సెటిల్ అయ్యాడు, తన స్నేహితుడు చిరంజీవి హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో మాత్రం సుధాకర్ కమెడీయన్ గా నటించాడు. అలా చిరంజీవితో యముడికి మెుగుడు సినిమాలో నటించడమే కాకుండా.. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో కూడా సగం వాటా పంచుకున్నారు.
అయితే వాళ్లు మెుదటి నంచి కూడా సుధాకర్-చిరంజీవిలు మంచి స్నేహితులు కావడంతో.. ఇంకా వీళ్లిద్దరి మధ్య ఈ రోజు వరకు మంచి రిలేషన్ ఉంది. అందుకే తన కొడుకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం.. అలాగే తన బాద్యతను మెుత్తం చిరంజీవి తీసుకున్నాడు. చిరంజీవి నాకు మంచి మిత్రుడు.. శ్రేయాభిలాషి.. ఇంకా అతనే నాకు అన్ని.. అని చెప్పుకొచ్చాడు. ఇంకా మా అబ్బాయి గురించి అప్పుడే చెప్పకూడదు కానీ.. చిరంజీవి గారే చేసి చూపిస్తారని.. అంటూ తన కొడుకు ఎంట్రీ గురించి సుధాకర్ చెప్పుకొచ్చాడు. గతంలో నా కొడుకు కాలేజీ సీటు విషయంలో కూడా చిరంజీవి దగ్గర ఉండి సహాయం చేశారని సుధాకర్ చెప్పాడు. మెుత్తానికి అయితే నా కొడుకు కెరీర్ ని తీర్చిదిద్దే బాద్యత చిరంజీవి తీసుకున్నాడు. అని.. మెగా ఆశిస్సులతో ప్రారంభమయ్యే సుధాకర్ కొడుకు సినీ కెరీర్ చాలా అద్బుతంగా.. అందంగా.. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విజయాలను అందుకోవాలని కోరుకుందాం.