బుల్లి తెరపై విష్ణు ప్రియకి మంచి క్రేజ్ ఉంది. హాట్ యాంకర్ గా, మంచి డ్యాన్సర్ గా మాత్రమే ఈమె గురించి తెలుసు. పలు టీవీ షోలకి తన అందంతో, చిలిపి తనంతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా బుల్లి తెర యాంకర్ విష్ణు ప్రియా తన జీవితంలో పడిన కష్టాలను గురించి చెప్పుకొచ్చింది. చాలా రోజుల తర్వాత తన నాన్నను కలిసి ఎమోషనల్ అయింది.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి జీవితాలు చూడడానికి చాలా గొప్పగా కనిపించినా.. ఆ స్థాయికి రావడానికి వారు పడిన కష్టం ఎవరికీ తెలియదు. అయితే కొన్ని సందర్భాల్లో వీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక వారి బాధలు అందరి ముందు తెలియజేస్తూ బాధ పడతారు. చూడడానికి మేకప్ వేసుకొని అందంగా కనపడుతూ అల్లరి చేస్తూ ఉన్న వీరి జీవితాలు తవ్వి చూస్తే చాలానే కష్టాలు ఉంటాయి. తాజాగా బుల్లి తెర యాంకర్ విష్ణు ప్రియా తన జీవితంలో పడిన కష్టాలను గురించి చెప్పుకొచ్చింది. చాలా రోజుల తర్వాత తన నాన్నను కలిసి ఎమోషనల్ అయింది.
బుల్లి తెరపై విష్ణు ప్రియకి మంచి క్రేజ్ ఉంది. హాట్ యాంకర్ గా, మంచి డ్యాన్సర్ గా మాత్రమే ఈమె గురించి తెలుసు. పలు టీవీ షోలకి తన అందంతో, చిలిపి తనంతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అయితే విష్ణు ప్రియ కెరీర్ ని చూసుకుంటే మూడేళ్ళ వయసు నుంచే చాలా కష్టాలు అనుభవించిందని తెలుస్తుంది. ఈమెకు మూడేళ్ళ వయసున్నప్పుడు వీరి పేరెంట్స్ విడిపోయారు. ఆ తర్వాత తన తల్లి దగ్గరే ఈమె జీవితాన్ని కొనసాగించగా.. తండ్రి మాత్రం వేరే పెళ్లి చేసుకున్నాడు. అయితే తన జీవితంలో విష్ణు ప్రియకి అనుకోని షాక్ తగిలింది. ఇటీవలే తన తల్లి చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయింది. కానీ తాజాగా తన తండ్రి దగ్గరకు చేరుకున్న విష్ణు ప్రియ ఫాదర్స్ డే సందర్భంలో జీ తెలుగులో ‘నేను నాన్న’ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో తండ్రితో పాటు హాజరైన విష్ణు ప్రియ.. ‘నాన్నని ప్రేమించని వ్యక్తి ఎవరు ఉంటారు..?’ అంటూ తాను ఆలస్యంగా పొందుకున్న తండ్రి ప్రేమ గురించి చెప్పుకొచ్చింది.
విష్ణు ప్రియ మాట్లాడుతూ “నాకు మూడేళ్లు ఉన్నప్పుడే అమ్మా నాన్నలు విడిపోయారు. ఇటీవలే మా అమ్మ చనిపోయారు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూశాను.. ఇప్పుడు అమ్మ చనిపోయిన తరువాత నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూస్తున్నా.. దాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నా.అమ్మ నాన్నలు విడిపోయినందుకు నేను చాలా లైఫ్ మిస్ అయ్యాను. అందుకే వాళ్లని తిట్టుకుంటూనే ఉన్నాను. నాలాగే మీలో ఎవరైనా నా స్థానంలో ఉంటే.. దయచేసి ద్వేషించవద్దు.. వాళ్లు ఎందుకు అలా చేశారో అర్ధం చేసుకోండి.. ఏది జరిగినా మీ మంచి కోసమే.. తండ్రి ప్రేమను మిస్ అయ్యాను. నాన్న వేరే పెళ్లి చేసుకున్నారు.. నాకు తమ్ముడు చెల్లెలు కూడా ఉన్నారు (సవతి తల్లి బిడ్డలు).. డాడీ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇది.. చాలా హ్యాపీగా ఉంది’ అంటూ తండ్రిని పట్టుకుని ఎమోషనల్ అయ్యింది యాంకర్ విష్ణు ప్రియ.