ధమాకా ముందు వరకు శ్రీలీల అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగే సరికి ఆమె చిన్నప్పుడు నటించిన సినిమా ఒకటి ట్రెండింగ్ లో నిలిచింది.ఈ సినిమాకి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ హీరోయిన్ ఎవరంటే వెంటనే శ్రీలీల అని చెప్పేస్తారు. స్టార్లతో వరుస సినిమా ఆఫర్లు కొట్టేస్తూ తక్కువ వ్యవధిలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ ఉన్నా.. పెళ్లిసందడి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి శ్రీలీల గ్లామర్ అని చాలామంది చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత రవి తేజ ధమాకా సినిమాలో నటించి అందరి దృష్టిలో పడింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించారని మీకు తెలుసా? ఈ సినిమాకి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ధమాకా ముందు వరకు శ్రీలీల అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగే సరికి ఆమె చిన్నప్పుడు నటించిన సినిమా ఒకటి ట్రెండింగ్ లో నిలిచింది. ఆ సినిమా పేరు చిత్రాంగద. సింధు తులాని చిన్నప్పటి పాత్రలో శ్రీలీల ఈ సినిమాలో కనిపించడం గమనార్హం. 2017 లో ఈ సినిమా రిలీజయింది. అశోక్ ఏ సినిమాకి దర్శకత్వం వహించాడు. అంజలి, సాక్షి గులాటి, సప్తగిరి ఈ సినిమాలో లీడ్ రోల్స్ లో కనిపించారు. ఇక ఈ సినిమా తర్వాత వేరే ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు.
శ్రీలీల రెమ్మునరేషన్ ఇప్పుడు బారీ రేంజ్ లో ఉన్నప్పటికి.. ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉండడంతో ఆ ముద్దుగుమ్మ కి ఆఫర్లు ఇవ్వడానికి నిర్మాతలు రెడీ గా ఉన్నారు. అయితే ఇతర ఇండస్ట్రీలో కూడా శ్రీలీల కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తుండగా..ఈ అమ్మడు మాత్రం మెల్లిగా ఆఫర్లను రిజక్ట్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె తొలిసినిమాతోనే డిజాస్టర్ రిజల్డ్ ను అందుకున్నా.. ఆ సినిమా గురించి ప్రేక్షకులకు అంతగా తెలియకపోవడం ప్లస్ గా మారింది. అలా ఈ ముద్దుగుమ్మ రాబోయే రోజులల్లో మరింత ఎదుగుతారేమో అని వేచి చూడాల్సి ఉంది. శ్రీలీల కు బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఆసక్తి ఉన్నా.. ఆమెకు నచ్చినట్లు సరైన ఆఫర్లు వస్తే బాలీవుడ్ పై ఫోకస్ చేయాలంటూ ఈ బ్యూటీ భావిస్తుందట. ఇంకా ఈ ముద్దుగుమ్మ ఇతర భాషల్లో కూడా సత్తా చాటితే పాన్ ఇండియా హీరోయిన్ గా మారి.. మరింత క్రేజ్ సంపాదించే అవకాశం ఉంటుంది.