‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో ప్రతిరోజు, ప్రతి టాస్కు ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇంట్లోని సభ్యులు అందరూ తమ బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ కంటే పంతాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు క్యూట్ జోడీ అనుకున్న మానస్- ప్రియాంక సింగ్ మధ్య దూరం పెరిగింది. తన ప్రపోజల్ ను రిజెక్ట్ చేయడంతో పింకీ కాస్త కుంగిపోయినట్లు గానే కనిపిస్తోంది. గేమ్ లో బాగా ఆడుతున్నట్లు కనిపిస్తున్నా ఆ ఎఫెక్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తోంది. అసలు ప్రియాంక సింగ్ ఎందుకు అంతలా ప్రేమ పెంచుకుంది? మానస్ రిజెక్ట్ చేయడానికి అసలు కారణాలేంటో చూద్దాం.
ఇంట్లోని సభ్యులు అందరూ ప్రియాంకను సిస్టర్ అనే పిలుస్తారు. అది మొదటి వారం నుంచి కూడా. వారి ఉద్దేశం ఏదైనా కానీ ఆమె ట్రాన్స్ జెండర్ కాబట్టే అలా తప్పించుకున్నారు అని కూడా కొందరి వాదన. అయితే మానస్ అలా చేయలేదు. ఆమెను మంచి ఫ్రెండ్ లా చూశాడు. ఆమెతో అందరికంటే క్లోజ్ గా ఉండేవాడు. ఒక సాధారణ మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ తనకి ఇస్తూ వచ్చాడు. ఎక్కడా కూడా అతను లైన్ క్రాస్ చేయలేదు. ప్రియాంక చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అతని లిమిట్స్ అతనికి తెలుసు. ‘మానస్ హస్బెండ్ మెటీరియల్’ అని పింకీ అనడానికి కారణం కూడా ఉంది. అతను అంత హుందా బిహేవ్ చేస్తాడు. మొదటి వారం నుంచి మానస్ తో తనకున్న పాజిటివ్ వైబ్స్.. అతని ఫ్రెండ్లీ నేచర్ ప్రియాంకను ప్రేమలో పడేలా చేశాయి.
మానస్.. అంటే తల్లిచాటు బిడ్డ అన్నది అందరికీ తెలుసు. నాగార్జున పరిచయం చేయడం కూడా అదే చేశాడు. అతనికి సంబంధించి ఏ నిర్ణయమైనా మానస్ తల్లి నిర్ణయం తీసుకోవాల్సిందే. గతంలో ప్రియాంక- మానస్ రిలేషన్ గురించి మానస్ తల్లి స్పందించిన విషయం తెలిసిందే. ‘నాకు ప్రియాంక అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ లో రిలేషన్స్ అన్నీ అక్కడి వరకే. ఇద్దరూ మంచి మిత్రులుగా ఉంటారు. ఆమెకు మంచి అబ్బాయితో దగ్గరుండి పెళ్లి చేస్తాను. నేను వేలు చూపించి ఎవరిని చేసుకోమంటే మానస్ వాళ్లనే చేసుకుంటాడు’ అని చెప్పిన విషయం తెలిసిందే. మానస్- ప్రియాంక సింగ్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు అన్న మాట వాస్తవం. అతనికి పింకీ మీది మంచి ఒపీనియన్ ఉంది అన్నది నిజం. కానీ, ఆ ఫీలింగ్స్ ప్రేమ, వివాహం వరకు వెళ్తాయని ఎవరూ అనుకోలేదు. వెళ్లాలని మానస్ కూడా భావించినట్లు ఎక్కడా కనిపించలేదు.
ప్రియాంక సింగ్ లక్షణంగా పదహారణాల తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. మానస్ కు ప్రియాంక చేసే సేవలు చూసి ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. మానస్ కు రాబోయే భార్య అయినా అన్ని సేవలు చేస్తుందో లేదో అని విశ్వ అన్న మాటలను బట్టే చెప్పుకోవచ్చు. ఎన్ని చెప్పుకున్నా మన దేశంలో ఒక ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకునే కల్చర్ ఇంకా రాలేదనే చెప్పాలి. అందులోనూ ఒక సెలబ్రిటీ ఆ నిర్ణయం తీసుకోవడం అంటే అది అసాధ్యంగానే చెప్పుకోవాలి. అదే మనం చూశాం కూడా. ప్రియాంక సింగ్- మానస్ ల రిలేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.