ప్రేమని ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యక్తపరుస్తారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తన ప్రేమను కొంచెం భిన్నంగా ప్రపోజ్ చేశాడు. దెబ్బకు అమ్మాయి ఫ్లాట్ అయిపోయింది.
ప్రేమ దేనితోనూ సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పుడుతుంది. ఈ మహా విశ్వంలో ప్రేమ అనేది అందరికీ అందుబాటులో ఉన్న అతి పెద్ద సబ్జెక్ట్. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరితో ఖచ్చితంగా ఈ ప్రేమ సబ్జెక్ట్ లో మునిగి తేలాల్సిందే. అది పెళ్ళికి ముందు కావచ్చు, పెళ్ళైన తర్వాత కావచ్చు. ఎప్పుడైనా గానీ ప్రేమ సాగరంలో పడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. అయితే ప్రేమలో పడడం ఒక ఎత్తు అయితే లవర్ ని ఇంప్రెస్ అయ్యేలా ప్రపోజ్ చేయడం మరొక ఎత్తు. ఎక్కువగా అబ్బాయిలే అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తారు. ఒక్కో ప్రేమికుడు ఒక్కో స్టైల్ లో ప్రపోజ్ చేస్తుంటాడు. గ్రీటింగ్ కార్డ్స్ ద్వారానో, బహుమతుల ద్వారానో లేక చాక్లెట్ల ద్వారానో ప్రపోజ్ చేస్తుంటారు. ఇంకొందరు ఐతే సినిమా హీరోల్లా ప్రపోజ్ చేస్తుంటారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమికుడు మాత్రం సినిమా రేంజ్ లో అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాడు. సినిమా సన్నివేశం కూడా సరిపోదేమో ఈ లవ్ సీన్ ముందు అనిపిస్తుంది. తన ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి స్నేహితుల సహాయం తీసుకున్నాడు ఈ యువకుడు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తన బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. వెనక నుంచి స్కూటీ మీద ఒక అబ్బాయి లవ్ సింబల్ తో కూడిన నలుపు టీ షర్ట్ వేసుకుని తన స్నేహితుడి ముందు నుంచి వెళ్తాడు. ఆ తర్వాత ఆంగ్లంలో ఐ అక్షరం ఉన్న తెల్లని టీ షర్ట్ వేసుకుని మరొక స్నేహితుడు, యు అనే ఆంగ్ల అక్షరం ఉన్న తెల్లని టీ షర్ట్ వేసుకుని మరొక స్నేహితుడు బైక్ మీద ముందుకు వెళ్లి ‘ఐ లవ్ యు’ అని అమ్మాయికి కనిపించేలా వరుసగా వాహనాలను నడుపుతుంటారు.
వెనుక నుంచి ఇదంతా వీడియో తీస్తున్న మరొక వ్యక్తి ఒక బొకే తీసుకొచ్చి స్నేహితుడికి ఇస్తాడు. స్నేహితుడు ఆ బొకే తీసుకుని.. బైక్ ఒక పక్కకు ఆపి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అంతే అమ్మాయి ఫ్లాట్. అమ్మాయి నవ్వుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి మనోడు ఆపుకోలేక సినిమా హీరోలా అక్కడే రోడ్డు మీద అమ్మాయిని కౌగిలించేసుకున్నాడు. అది చూసి స్నేహితులు ముసిముసి నవ్వులు నవ్వేసుకుంటున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో కొంతమంది ఈ లవ్ ప్రపోజల్ సీన్ తమకు నచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొంతమంది మాత్రం వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. నిజమే ఎందుకంటే ఈ గ్యాంగ్ లో ఒకడికి తప్ప ఇంకెవరికీ హెల్మెట్ లేదు. అమ్మాయికి రోడ్డు మీద ప్రపోజ్ చేయడం సంగతి అటుంచితే.. అయితే వీరు చేసిన తప్పల్లా హెల్మెట్ లేకుండా హైవే మీద బైక్ నడపడం. ఏ రద్దీ లేని ప్రదేశంలోనో, హెల్మెట్ పెట్టుకోకపోయినా పర్లేదనిపించే ప్రాంతంలోనో లవ్ ప్రపోజల్ సీన్ పెట్టుకుని ఉంటే బాగుండేది. అందుకే కొంతమంది దీన్ని తప్పుబడుతున్నారు. మరి ఈ వెరైటీ లవ్ ప్రపోజల్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
வெளிநாட்டுக்காரனை பாத்து இந்த கெரகம் எல்லாம் ஒகே .. ஆனா ஒருத்தன் கூட ஹெல்மெட் போடல .. அதுவும் ஹைவேஸ்ல .. மத்தவங்க உயிருக்கும் ரிஸ்க் . @tnpoliceoffl இந்த மாதிரி மெது இடத்துலே ஆபத்தா வீடியோ பண்றவங்களை புடிச்சு தண்டிக்கலானா இது ஒருநாள் வீபரீதமாகும் pic.twitter.com/2DZXeSPwPV
— 🅿️🅰️🅱️L🅾️. 🖌️🖌️ (@pablo_twtz) May 12, 2023