హీరోయిన్ గా కొనసాగాలన్నా.. నటిగా మంచి అవకాశాలు రావాలన్నా ముందు వారికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండాలి. వారు లైమ్ లైట్ లో ఉండాలి. అలా అయితేనే వారికి అవకాశాలు కూడా వస్తుంటాయి. అందుకే ముఖ్యంగా హీరోయిన్లు ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పెడుతూ వైరల్ అవుతుంటారు.
నటన, ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అని అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరు లైమ్ లైట్ లో ఉంటే వారికే అవకాశాలు దక్కుతాయి. వారికే ప్రాధాన్యత ఉంటుంది. అందుకోసం నటీనటులు చేయని ప్రయత్నాలు ఉండవు. అలాంటి ప్రయత్నాలే ఇప్పుడు బిగ్ బాస్ పింకీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ పింకీ.. జబర్దస్త్ లో లేడీ గెటప్ తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకు ప్రియాంక సింగ్ గా మారిపోయింది. కామెడీ స్కిట్ల ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత బిగ్ బాస్ తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బిగ్ బాస్ షోతో తన కెరీర్ మంచి టర్న్ తీసుకుంటుందని భావించింది. కానీ, ఆమె కెరీర్ లో పెద్దగా మార్పులు రాలేదు.
ప్రియాంక సింగ్ అడపాదడపా కొన్ని షోస్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదా అయితే దక్కింది. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు, వీడియో, ప్రమోషన్స్ గట్టిగానే చేస్తోంది. ఈ మధ్య బోల్డ్ పిక్స్ తో ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి మతి పోగొడుతోంది. బిగ్ బాస్ పింకీని మరీ బోల్డ్ గా ఎప్పుడూ చూసుండరు. ఆమె ఈ మధ్య మాత్రం ట్రాక్ మార్చి బోల్డ్ పిక్స్ పెడుతోంది. తాజాగా రెండు ఫొటోలు షేర్ చేసింది. ఒక టవల్ కట్టుకుని కూర్చున్న పిక్స్ అవి. కాస్త కాదు గానీ.. ఎక్కువగానే బోల్డ్ గా ఉన్నాయి. ఈ పిక్స్ కి కచ్చితంగా నెగెటివ్ కామెంట్స్ వస్తాయని గెస్ చేసిన పింకీ ఒక కోటేషన్ పెట్టింది.
“ఇది బోల్డ్ కాదు.. నేను ఒక ఆర్టిస్ట్ ని గుర్తుపెట్టుకోండి. నా అందాన్ని హృదయంతో చూడండి. కామంతో కూడిన కళ్లతో కాదు” అంటూ రాసుకొచ్చింది. పింకీ గెస్ కొట్టినట్లుగానే ఈ పోస్ట్ కి నెగెటివ్ కామెంట్స్ మాత్రమే కాదు.. చిన్న సైజ్ క్లాసులు కూడా తీసుకుంటున్నారు. ఆడవాళ్ల పరువు తీస్తోందంటూ రెచ్చిపోతున్నారు. అసలు పింకీ ఏంటి? ఈ ఫొటోలు ఏంటి? నీకు బుర్ర పని చేయడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరీ ఇంత దిగజారిపోవాలా? నేను నిన్న అన్ ఫాలో చేస్తున్నాను అంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. ఇలాంటి పిక్స్ ఏదైనా హీరోయిన్ పెడితే రెచ్చిపోయి కామెంట్స్ పెడతారు. హాట్- సూపర్ అంటూ పొగిడేస్తారు.
అదే ఏ సీరియల్ ఆర్టిస్టో, బిగ్ బాస్ బ్యూటీనో అయితే మీరు దిగజారిపోతున్నారు అంటూ జడ్జిమెంట్ పాస్ చేస్తున్నారు. పింకీకి సపోర్ట్ చేసేవాళ్లు కూడా లేకపోలేదు. పాజిటివ్ బ్యాచ్ అంతా పింకీ నువ్వు ఇవేం పట్టించుకోవద్దు.. దూసుకుపో అంటూ రెచ్చగొడుతున్నారు. నీకు నచ్చినట్లు నువ్వు ఉండు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఎవరి లైఫ్ వాళ్లకు నచ్చినట్లు జీవించే హక్కు ఉంటుందని మర్చిపోవద్దంటూ న్యూట్రల్ గా ఉండేవాళ్లు హితబోద చేస్తున్నారు. బిగ్ బాస్ పింకీ పోస్ట్ చేసిన బోల్డ్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.