ప్రియాంకా సింగ్ అలియాస్ పింకీ అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు. బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత కచ్చితంగా అవకాశాలు వస్తాయని భావించింది. కానీ, అలా ఏం జరగలేదు. స్టార్ మాకి సంబంధించిన షోలలో కనిపించడమే తప్ప.. పెద్దగా అవకాశాలు రాలేదు. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఆమె ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.
ప్రియాంకా సింగ్ అలియాస్ బిగ్ బాస్ పింకీ.. ఈమెకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. నెట్టింట ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 5లో అడుగుపెట్టి 13 వారాలు హౌస్ లో ఉండి శభాష్ అనిపించుకుంది. బిగ్ బాస్ హిస్టరీలో ఒక ట్రాన్స్ జెండర్ అన్ని వారాలు ఉండటం అదే తొలిసారి. ఆ షో వల్ల తెలుగు రాష్ట్రాల్లో పింకీకి అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ఆమె లైఫ్ లో జరిగిన విషయాలు, షోలోనే తండ్రికి తాను అమ్మాయిగా మారిన సంగతి చెప్పడం ద్వారా అందరికీ కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వస్తాయంటూ ఆశలు పెట్టుకుంది. కానీ, ఇప్పటికీ సోషల్ మీడియాకే పరిమితమైంది.
ప్రియాంకా సింగ్ జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టింది. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ పరిచయమైంది. ఆ తర్వాత సర్జరీ ద్వారా ట్రాన్స్ జెండర్ గా మారిపోయింది. కొన్నాళ్లకు బిగ్ బాస్ ద్వారా ఆమెకు ఒక మంచి స్టేజ్ లభించింది. పైగా బిగ్ బాస్ ద్వారా ఆమెకు అభిమానులు కూడా పెరిగారు. షో తర్వాత కచ్చితంగా అవకాశాలు వస్తాయని భావించింది. కానీ, అలా ఏం జరగలేదు. స్టార్ మాకి సంబంధించిన షోలలో కనిపించడమే తప్ప.. పెద్దగా అవకాశాలు రాలేదు. మళ్లీ పింకీ సోషల్ మీడియాకే పరిమితమైంది. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఆమె ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోలు, రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట దుమారం రేపాయి.
ఆ పోస్టుకు “నేను యాటిట్యూడ్ తో పుట్టలేదు. కానీ, నాకు గుడ్ యాటిట్యూడ్ ఉంది. నా లైఫ్ లో నేను ఎదిగేందుకు అది ఉపయోగపడుతుంది. నా కళ్లు కూడా అదే చెప్తాయి” అంటూ క్యాప్షన్ జోడింటింది. ఈ పోస్టులో పింకీ గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. ఈ పోస్టు చూసిన నెటిజన్స్ ఇప్పటివరకు ఆమెపై ఉన్న సాఫ్ట్ కార్నర్, అభిమానం అన్నీ పోయాయంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె అలాంటి పిక్స్ పెట్టడంతో అందరూ విమర్శలకు దిగారు. మరీ ఇంత దారుణమైన ఫొటోలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇన్నాళ్లూ నీపై ఉన్న అభిమానం, నీకు ఇచ్చిన విలువ ఈ పోస్టుతో పోయాయంటూ పెదవి విరుస్తున్నారు. అయితే పింకీని సపోర్ట్ చేసేవాళ్లు కూడా లేకపోలేదు. ఆమె సినిమా ఫీల్డ్ లో ఉంది. ఇలాంటి ఫొటోలు పెట్టడం సహజం అంటూ కొందరు ప్రియాంకా సింగ్ కి సపోర్ట్ చేస్తున్నారు. పింకీ ఇన్ స్టాగ్రామ్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.