‘బిగ్ బాస్ 5 తెలుగు’లో ప్రతి ఎపిసోడ్‌కి ప్లాన్ చేస్తున్న ట్విస్టులు, ఇస్తున్న షాకులకు ప్రేక్షకులకు మతి పోతోంది. శనివారం అంటే తెలుసుగా కింగ్ నాగార్జున ఎంట్రీ ఇస్తాడు. వారం మొత్తం జరిగిన గొడవలు, గిల్లిగజ్జాలు, వివాదాలను సద్ధుమణిగేలా తన వంతుగా ప్రయత్నిస్తాడు. అవసరమైన దగ్గర సీరియస్‌గానే క్లాస్ పీకుతాడు. ఈ వారం హౌస్‌లో చాలానే రచ్చలు జరిగాయి. వాటిలో ముఖ్యంగా ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంది.. క్లారిటీ రావాలని కోరుకుంటుంది ప్రియ, రవి, లహరి మధ్య జరిగిన హగ్గు గొడవ గురించే. మరి దాని గురించి కింగ్ నాగ్ ఎలా క్లారిటీ ఇచ్చాడో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పటివరకు మీరు ఎవరైతా దోషి అనుకుంటున్నారో.. ఎవరు బాధితుడు అనుకుంటున్నారో అదంతా రివర్స్ అయ్యింది.
అసలు విషయం ఏంటంటే నాగార్జున స్టేజ్‌పై హౌస్‌లో ఉన్న అందరి పేర్లతో టైల్స్ ఏర్పాటు చేయించారు. ‘హౌస్‌లో అందరికీ క్వశ్చన్స్, క్వశ్చన్స్ ఉన్నాయి. మరి వాటిని క్లియర్ చేద్దామా?’ అంటూ నాగార్జున రవి, ప్రియ టైల్స్‌ను పగలకొడతాడు. నువ్వు సింగిల్ మెన్ అని అన్నావా లేదా అని నేరుగా ప్రశ్నిస్తాడు. అందుకు రవి తడుముకోకుండా నేను క్లారిటీ ఇచ్చా.. వెళ్లి సారీ కూడా చెప్పానంటాడు. అందుకు ప్రియ లేదు చెప్పలేదు అంటుంది. హగ్గు మీద ప్రియ మాట్లాడింది మొత్తం వేరేలా అర్థమైందని నాగార్జున చెప్పాడు. నేను తప్పుగా అనలేదు అన్న ప్రియ వాదనను నాగార్జున తోసిపుచ్చాడు. అంతేకాకుండా అసలు ఈ వాదనలో బాధితురాలుగా ఉన్న లహరికి నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.
లహరిని పవర్ రూమ్‌లోకి వెళ్లాల్సిందిగా నాగార్జున సూచిస్తాడు. పవర్ రూమ్‌లోకి వెళ్లిన లహరికి బిగ్ బాస్ ఓ వీడియోని ప్లే చేసి చూపిస్తాడు. అందులో లహరి గురించి రవి గతంలో ఏం మాట్లాడాడో ఉంటుంది. అది మొత్తం చూశాక లహరికి పిచ్చ క్లారిటీ వచ్చింది. ‘ఈ సీజన్ అయ్యాక ఆమె యాంకర్ కావాలని ట్రై చేస్తోంది. బట్ లీడింగ్ సింగిల్ మెన్ హియర్’ అంటూ లహరి గురించి రవి మాట్లాడిన వీడియోని ప్లే చేశారు. ఆ తర్వాత ఎవరిది తప్పు కాదు అనుకుంటున్నావో వారిని హగ్ చేసుకో.. ఎవరిది తప్పు అని నువ్వు భావిస్తున్నావో వారిని నిలదీయాల్సిందిగా నాగార్జున కోరతాడు. లహరి ఇప్పుడు ప్రియని హగ్ చేసుకుంటుదని కొందరు.. ప్రియది కూడా తప్పుందని ఆమెను కూడా క్వశ్చన్ చేయాలని కొందరు చర్చలు మొదలు పెట్టేశారు. లహరి రియాక్షన్ చూడాలంటే ఎపిసోడ్ ప్లే అయ్యేదాకా ఆగాల్సిందే.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ లేటెస్ట్ అప్‌డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్ గురించి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.