‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌ లో మానస్‌ కు ప్రపోజ్ చేసిన ప్రియాంక సింగ్..

pinky manas love

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌ లో ఏం జరిగినా అది చూసేవాళ్లకు ఇంట్రస్టింగ్‌ గా మారిపోతోంది. సోమవారం జరిగిన నామినేషన్స్‌ హౌస్‌ లో మంచి హీట్‌ ను పెంచాయి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు సోషల్‌ మీడియా హాట్‌ టాపిక్‌ గా మారింది మానస్‌- ప్రియాంక సింగ్‌ రిలేషన్‌ గురించే. ప్రియాంక సింగ్‌ మానస్‌ కు ప్రపోజ్‌ చేసింది. అందరూ అనుకున్నదే కానీ, ఇన్నాళ్లు తన పనులతో మానస్‌ పై ఉన్న ఇష్టాన్ని చెప్పిన పింకీ ఈసారి డైరెక్ట్‌ గా చెప్పేసింది.. నువ్వంటే ఇష్టం అని. అందుకు మానస్‌ షాకవ్వలేదు. ఎందుకంటే ప్రేక్షకులతో పాటు ప్రియాంక విషయం మానస్‌ కు కూడా తెలుసు కాబట్టి.

పింకీ ప్రపోజల్‌..

మోజ్‌ రూమ్‌ లో డల్‌ గా కూర్చున్న ప్రియాంకతో మానస్‌ కాసేపు మాట్లాడాడు. ఈ హౌస్‌ లో ప్రియాంకతో జెన్యూన్‌గా రిలేషన్‌ మెయిన్‌టైన్‌ చేస్తోంది మానస్‌ ఒక్కడే అన్నది అందరి అభిప్రాయం. ఇన్నాళ్లు మనసులో ఉంచుకున్న అభిమానాన్ని ప్రియాంక చెప్పేసింది. ‘ఏమో తెలీదు మానస్‌.. నువ్వంటే నాకు ఇష్టం అనిపిస్తంది.తెలీదు మానస్‌ ఐ ఫీల్‌ గుడ్‌ అంతే. ఫస్ట్‌ టైమ్‌ చూసినప్పటి నుంచి ఏదో ఒక పాజిటివ్‌ గా అనిపిస్తది. ఇది కరెక్ట్‌ కాదన్న సంగతి నాకు తెలుసు’ అంటూ ప్రియాంక తన మనసులోని మాటను చెప్పేసింది.

మానస్‌ ఇన్‌టెన్షన్‌..

మొదటి నుంచి మానస్‌ ప్రియాంకను ఒక మంచి ఫ్రెండ్‌ లాగానే చూశాడు. నువ్వు ఎప్పుడైనా నీ లిమిట్స్‌ క్రాస్‌ అయినట్లు అనిపిస్తే నేను నీకు చెప్తాను అని ముందే చెప్పేశాడు. నేను నీకు ఒక మంచి ఫ్రెండ్‌ లా ఉండగలను. అంతకు మించి ఏమీ ఎక్స్‌ పెక్ట్‌ చేయకు అని. హౌస్‌ లోని సభ్యులు మొత్తం ప్రియాంకను ఏదో ఒక టైమ్‌ లో తక్కువ చేసి చూడచ్చు కానీ, మానస్‌ మాత్రం తను ట్రాన్స్‌ జెండర్‌ అని తెలిసి కూడా ఆమెకు ఎంతో రెస్పెక్ట్‌ ఇచ్చేవాడు. ఆమె ఫీలింగ్స్‌ పెరుగుతున్న దృష్ట్యా నాగార్జున కూడా మానస్‌ ను వార్న్‌ చేశాడు. అందుకు మానస్‌ డైరెక్ట్‌ గా చెప్పెస్తే ఫిజికల్‌ ఏమైనా హర్ట్‌ చేసుకుంటుందా అనే భయంతోనే అలా చెప్పలేకపోతున్నా అని చెప్పాడు. మరోవైపు ఒక కాలర్‌ మానస్‌ ను అడిగిన ప్రశ్నకు కూడా బాగా హర్ట్‌ అయ్యాడు. మీరు ప్రియాంకతో కలిసి కంటెంట్‌ ఇస్తున్నారా? అనే ప్రశ్నకు బాగా ఫీల్‌ అయ్యాడు. మొదటి నుంచి మానస్‌ చెప్తున్నది ఒక్కటే ప్రియాంక ఒక మంచి ఫ్రెండ్‌ మాత్రమే అంతకు మించి ఏమీ లేదు. గతంలో మానస్‌ తల్లి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.