జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా పేరొందిన పవిత్ర.. రియల్ లైఫ్ లో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా స్థిరపడుతోందట. ఓవైపు టీవీ షోస్ చేస్తూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది.
జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఫిమేల్ కమెడియన్స్ లో పవిత్ర ఒకరు. సోషల్ మీడియాలో పాగల్ పవిత్రగా ఫేమస్ అయ్యింది. జబర్దస్త్ తో ఫేమ్ అయినప్పటికీ.. పవిత్ర ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనలతో పాటు ఫెస్టివల్స్ కి స్పెషల్ ఈవెంట్స్ లలో కూడా రెగ్యులర్ గా సందడి చేస్తుంటుంది. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా పేరొందిన పవిత్ర.. రియల్ లైఫ్ లో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా స్థిరపడుతోందట. ఓవైపు టీవీ షోస్ చేస్తూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. ఆ మధ్య కారు కూడా కొని అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఎక్కువగా జబర్దస్త్ రోహిణితో క్లోజ్ గా కనిపిస్తుంది పవిత్ర.
ప్రెసెంట్ పవిత్ర కెరీర్ ని లీడ్ చేస్తూ.. సోలోగా ఉంటోంది. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే సందర్భంగా తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొంది పవిత్ర. ఆమెతో పాటు తనకు ఇదివరకే స్టేజ్ పై ప్రపోజ్ చేసిన సంతోష్ కుమార్ కూడా పాల్గొన్నాడు. కాగా.. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరికీ సంబంధించి అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. పైగా వాలెంటైన్స్ వీక్ లో వచ్చారు కాబట్టి.. సంతోష్ కుమార్ లైవ్ లో పవిత్రకి లవ్ ప్రపోజ్ చేయడం.. దానికి పవిత్ర కూడా దాదాపు ఓకే అన్నట్లుగా రియాక్ట్ అవ్వడం వీడియోలో హైలెట్ అవుతున్నాయి. ప్రస్తుతం పవిత్రకి లవ్ ప్రపోజ్ చేసిన సంతోష్ కుమార్ ఎవరు? అనేది కూడా ఆరా తీయడం మొదలు పెట్టేశారు నెటిజన్స్.
సంతోష్ ప్రపోజ్ చేస్తూ.. ఇదివరకే ఓసారి శ్రీదేవి షోలో చెప్పిన డైలాగ్ రిపీట్ చేశాడు. ‘ప్రేమిస్తున్నాను కాబట్టి.. భరిస్తా అనట్లేదు, భరించగలను కాబట్టే ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యూ పవిత్ర’ అని చెప్పేసరికి నవ్వింది కానీ రియాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత సంతోష్ మాట్లాడుతూ.. తనను అందరూ ఫేమ్ లో ఉందని చూస్తున్నారు. నేను అలా చూడట్లేదు. ఫస్టాఫ్ ఆల్.. తనొక అమ్మాయి, నేనొక అబ్బాయి. అలా నేను తనను లవ్ చేస్తున్నాను. అది ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం తన ఇష్టం అని అన్నాడు. దాదాపు అతని మాటలకు పవిత్ర పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యింది కానీ.. కన్ఫర్మ్ చేయలేదు. ప్రెసెంట్ ఫ్రెండ్ గా ఓకే అంది” ప్రస్తుతం వీరి ఫుల్ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. త్వరలోనే పవిత్ర నుండి గుడ్ న్యూస్ రానుందని ఫ్యాన్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి పవిత్ర లవ్ ట్రాక్ ఎంతవరకు సక్సెస్ కానుందో! మరి పవిత్ర – సంతోష్ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.