రవిని అడ్డంగా బుక్‌ చేసిన నాగార్జున.. లహరి విషయంలో చేసిన పనికి..

ravi bigboss5 tollywood

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ సీజన్‌ ఇప్పటివరకు వచ్చిన అన్ని సీజన్లకంటే ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తోంది అనడం అతిశయోక్తి కాదు. మొదటి వారం నుంచే గొడవలు మొదలయ్యాయి. ఇక, నామినేషన్స్‌ రోజు అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు హౌస్‌కు సంబంధించి అందరి మాట్లాడుకుంటున్న టాపిక్‌ లహరి, ప్రియ, రవి వీళ్ల మధ్య జరిగిన వివాదం గురించే. అందుకు సంబంధించి యాంకర్‌ రవి చేసిన పనిని ప్రేక్షకులకు ముఖ్యంగా లహరికి చూపించాడు నాగార్జున. అప్పటి నుంచి రవి అందరి ముందు దోషిగా కనిపించాడు. అయితే అసలు వివాదం ఏంటి? ఏం జరిగింది అని తెలుసుకుందాం.

బాత్‌రూమ్‌లో హగ్గు

నామినేషన్‌లో లహరి ప్రియని నామినేట్‌ చేసి మీరు నాతో డిస్‌కనెక్ట్‌ అయ్యారు అని చెప్పింది. అందుకు కోపంతో ప్రియ, లహరిని నామినేట్‌ చేస్తూ ‘నువ్వు బాగా బిజీ అయిపోయావ్‌. ఇంట్లోని అదర్‌ మెన్‌తో బిజీగా ఉన్నావు’ అని కామెంట్‌ చేయడంతో వివాదం రాజుకుంది. ఎవరితో ఎక్కడ చూశావు అని అడగ్గా.. లేట్‌ నైట్‌ బాత్‌రూమ్‌లో రవిని హగ్‌ చేసుకుంటే చూశాను అంది. అంతే ఇంక రవి, ప్రియ, లహరి మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఆ వివాదానికి కింగ్‌ నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో శుభం కార్డు వేశాడు. అసలు ఏం జరిగింది అని రవిని అడగ్గా ప్రియ అలా చెప్పడం కరెక్టు కాదు. అది జస్ట్‌ ఫ్రెండ్లీ హగ్గే అందుకు లేట్‌ నైట్‌, బాత్‌రూమ్‌ ఇలా చెప్తే రాంగ్‌గా వెళ్తుందని అన్నాడు. చూసిందే కదా చెప్పింది ఆమె.. లాన్‌లో బెడ్‌రూమ్‌లో అయితే అలా అనరు కదా అంటూ నాగార్జున కామెంట్‌ చేశాడు. హౌస్‌లో జెండర్‌ డిస్క్రిమినేషన్‌ లేదని.. ఎవరు ఏ టైమ్‌లో అయినా హౌస్‌లో ఎకడైనా ఉండచ్చని క్లారిటీ ఇచ్చాడు. ప్రియ చెప్పిన విషయం రాంగ్‌గా అర్థం చేసుకున్నారు ప్రేక్షకులు, బయటకి కూడా రాంగ్‌గానే వెళ్లిందని చెప్పాడు.

ravi bigboss5 tollywood

వీడియోతో రవి డబుల్‌ గేమ్‌ బట్టబయలు

ప్రియ అలా మాట్లాడటానికి రవి అన్నమాటలే కారణం అని ప్రియ మానస్‌తో చెప్పుకుంది. రవి గతంలో అలా చెప్పబట్టే ఆ మాట అన్నానని. వారిపై తనకు కోపం లేదని భావోద్వేగానికి గురైంది ప్రియ. పవర్‌ రూమ్‌లో నాగార్జున వీడియో చూపించడంతో లహరికి అసలు దోషి ఎవరనేది క్లారిటీ వచ్చింది. లహరి చూసిన వీడియో రవి, ప్రియ మాట్లాడుకుంటూ కనిరపించారు. ‘ఈ సీజన్‌ తర్వాత లహరి యాంకర్‌ కావాలని కోరుకుంటోంది. అందుకు నా సపోర్ట్‌ కోసం నా వెనకాల పడుతోంది. హౌస్‌లో సింగిల్‌ మెన్ ఉన్నాకు కదా’ అంటూ రవి ప్రియతో అన్న మాటలు చూసి లహరి షాక్‌ అయ్యింది. బయటకు వచ్చాక ప్రియను హగ్‌ చేసుకుని రవికి క్లాస్‌ పీకింది లహరి. నేను యాంకర్‌ కావాలంటే నాకు ఎవరి సపోర్ట్ అక్కర్లేదు. నేను బ్రో అని అనకపోయినా.. నిన్ను అలాగే అనుకున్నా ఇంకెప్పుడు వెనక మాట్లాడకండి అంటూ క్లాస్‌ పీకింది. సింగిల్‌ మెన్‌ అనలేదు అని ఒట్టేసి కూడా ప్రియతో అన్నాడు రవి. ఆ తర్వాత మళ్లీ ఒప్పుకుని సారీ చెప్పానని అన్నాడు. నాగార్జున చెప్పాడా అని అడగ్గా నాకు చెప్పలేదు అని ప్రియ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు రవి డబుల్‌ గేమ్‌ ఆడాడని క్లారిటీకి వచ్చేశారు. ఒట్టేసి కూడా అబద్ధం చెప్పాడు రవి అని టాక్‌ స్టార్ట్‌ అయిపోయింది.

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, గాసిప్స్‌, ఎలిమినేషన్స్‌ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్‌ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.