ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోతుంటే ఏ లవర్ కైనా కడుపు మండిపోతూ ఉంటుంది. ఎలా అయినా ఆ పెళ్లిని ఆపేసి తన ప్రియురాలిని దక్కించుకోవాలి అనుకుంటాడు. కానీ.., రియల్ లైఫ్ లో ఇలాంటి సాహసాలకి తావు ఉండదు. ఇందుకే చాలా మంది యువకులు తమ ప్రియురాలి పెళ్ళికి అటెండ్ అవుతూ ఉంటారు. మండపంపై పెళ్లి బట్టల్లో ఉన్న తన ప్రేయసిని చివరిసారి కళ్ళారా చూసుకుని.., ఆమె రూపాన్ని గుండెల నిండుగా నింపుకుని.., నీ సుఖమే నే కోరుకున్నా అంటూ మౌనంగా బయటకి వచ్చేస్తుంటారు. కానీ.., ఇక్కడ మాత్రం ఓ ప్రియుడు ధైర్యంగా ఓ అడుగు ముందుకి వేశాడు. కొద్దీ నిమిషాల్లో పెళ్లి చేసుకోబోతున్న తన ప్రియురాలితో చివరిసారిగా మాట్లాడాలి అనుకున్నాడు. కుదిరితే ఆమెని ఒప్పించి, దైర్యం చెప్పి మండపం నుండి తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నాడు.
ఈ విషయంలో అతనికి మరో ఇద్దరు స్నేహితులు సహాయంగా వచ్చారు. కట్ చేస్తే.., ఆ ప్రియుడు తనని తాను అమ్మాయిగా సింగారించుకుని పెళ్లి మండపంలోకి అడుగుపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.., భదోయి ప్రాంతానికి చెందిన యువతీయువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోయింది.దీంతో వీరిద్దరిని విడదీసి, సదరు యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయించారు. కానీ.., ఎలా అయినా తన ప్రియురాలి పెళ్లికి వెళ్లాలనుకున్నాడు ఆ ప్రేమికుడు. ఇక్కడే అతను అతి తెలివిగా ఆలోచించాడు. అతను మహిళ మాదిరి చీర ధరించాడు. గాజులు వేసుకున్నాడు. విగ్ పెట్టుకుని సుందరంగా ముస్తాబయ్యాడు. ఇక తన ఇద్దరు స్నేహితుల సాయంతో ప్రియురాలి వివాహం జరుగుతున్న పెళ్లింటికి చేరుకున్నాడు.
కానీ.., అమ్మాయిలా రెడీ అయ్యే తొందర్లో అతను ఏకంగా పెళ్లి కూతురులా ముస్తాబైపోయాడు. దీంతో.., అతన్ని చూడగానే యువతి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వారు జుట్టు పట్టుకుని లాగగానే అక్కడికక్కడే అతను విగ్గు కూడా ఊడిపోయింది. దీంతో.., అతనికి తోడుగా వచ్చిన ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి జంప్ అయ్యారు. అలా ప్రియురాలిని కలవాలనుకున్న అతడి ఆశలు ఆవిరైపోయాయి. యువతి కుటుంబ సభ్యులు అతన్ని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతనికి కౌన్సలింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ప్రియురాలితో చివరిసారిగా మాట కలపడానికి ఇతను చేసిన ప్రయత్నం దేశమంతటా వైరల్ అవ్వడం విశేషం. మరి.., ఈ వ్యవహారంలో ఆ ప్రియుడు చేసింది తప్పు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.