తమిళ సూపర్ స్టార్ రజని కాంత్..కాదు కాదు.. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లేట్ గా అయినా లేటెస్ట్ గా వచ్చి జైలర్ సినిమా తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ లెవెల్లో దండయాత్ర చేస్తున్నాడో అందరు చూస్తున్నారు.
తమిళ సూపర్ స్టార్ రజని కాంత్..కాదు కాదు.. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లేట్ గా అయినా లేటెస్ట్ గా వచ్చి జైలర్ సినిమా తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ లెవెల్లో దండయాత్ర చేస్తున్నాడో అందరు చూస్తున్నారు. ఎన్నోకొత్త రికార్డులని రజని ఈ మూవీ ద్వారా క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా జైలర్ సినిమా కి సంబంధించిన ఒక న్యూస్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జైలర్ మూవీని చూడబోతున్నాడు. అది కూడా రజనికాంత్ తో కలిసి చూడబోతున్నాడు.
రజనీకాంత్ తన సినీ కెరీర్ లో చూడని విజయం లేదు. సృష్టించని రికార్డు లేదు. రజని అనే పేరు తమిళనాడు వరకే పరిమితం కాదు. రజని అనే పేరు వినబడితే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు రజని మా వాడు అంటూ మురిసిపోతారు. నిప్పులు వెదజల్లే లావా లాంటి క్రేజ్ రజని సొంతం. కానీ రజని ఏనాడూ తనకున్న క్రేజ్ గురించి ఆలోచించడు. ఎప్పుడు సాధ్వికం తో ఒక మౌన మునిలా ఉంటాడు. ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళ్తుంటాడు. తాజాగా జైలర్ సినిమా విడుదలకు ముందే రజని హిమాలయాలకు వెళ్ళాడు.ఇప్పుడు హిమాలయాల నుంచి తిరిగొచ్చాడు
యోగి ఆతిథ్య నాధ్.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంతిగా భారతీయ జనతా పార్టీ తరుపున వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేస్తున్నఒక పవర్ ఫుల్ ముఖ్యమంత్రి. ఉత్తర ప్రదేశ్ ని అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు పోయేలా చేస్తు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి పేదల గుండెల్లో కొలువు తీరి ఉన్న గొప్ప ప్రజా నాయకుడు. ఎప్పుడు బిజీ బిజీ గా గడిపే యోగి అథిత్యనాధ్ జైలర్ సినిమాని చూడబోతున్నారు. స్వయంగా రజని కాంత్ తో కలిసి యుపి లో యోగి అథిత్యనాధ్ జైలర్ మూవీని చూడబోతున్నారు.
ప్రస్తుతం ఈ వార్త రాజకీయవర్గాల్లో సంచలనం సృష్ష్టిస్తుంది. ఎప్పుడు కాషాయ వస్త్రాన్ని మాత్రమే ధరించే యోగి ఆదిత్యనాధ్ కి ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. రజని కాంత్ కి కూడా ఆధ్యాత్మికత చాలా ఎక్కువ. యోగి ఆదిత్య నాద్ బీజేపీ ముఖ్యమంత్రి అని అందరికి తెలిసిన విషయమే . ఏది ఏమైనా రజని ,యోగి ఆదిత్యానాద్ లు కలిసి యుపి లో జైలర్ మూవీ వీక్షించడం సినిమా వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది.