నో వ్యాక్సినేషన్‌ నో సాలరీ … హెచ్చరిస్తోన్న రాష్ట్రం – మన దేశంలోనే!..

సెకండ్ వేవ్ తో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వైరస్ ను అరికట్టేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే కొందరు టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరికొందరు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయోమేనని బయపడుతున్నారు. దీంతో టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లా అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు వ్యాక్సిన్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోరో వారికి నెల జీతాన్ని కట్ చేసేలా నిబంధన పెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీతం రాకపోతే ఎలా ఉంటుందో తెలిసిందే. అందుకే ఉద్యోగులను టీకా వేయించుకునేలా జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర విజయ్ సింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

GettyImages 1218961180

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే టీకానే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కొవిడ్‌ టీకా తీసుకోకపోతే సదరు ఉద్యోగిపై సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుంది. మే నెల జీతాన్ని నిలిపివేస్తుంది’ అని గౌర్‌ వెల్లడించారు. జిల్లా ట్రెజరీ అధికారులకు, ఆయా విభాగాధిపతులకు దీనికి సంబంధించి మార్గదర్శకాలు పంపినట్లు ఆయన తెలిపారు. టీకాలు తీసుకున్న ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని అందరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చూడాలని ఆయన కోరారు. ‘నో వ్యాక్సినేషన్‌ నో సాలరీ’కి సంబంధించి జిల్లా కలెక్టర్‌ చంద్ర విజయ్‌ సింగ్‌ మౌఖిక ఆదేశాలు జారీ చేశారని జిల్లా చీఫ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి చర్చిత్‌ గౌర్‌ చెప్పారు. టీకా వద్దన్న ఉద్యోగులపై విచారణ జరిపించడమే కాకుండా నెల జీతం చెల్లించడాన్ని నిలిపి వేయాలని అన్నారు. ఉద్యోగం చేస్తూ నెల జీతం అందుకోకపోవదం ఎందుకని వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకొస్తున్నారు కొందరు ఉద్యోగులు.