ఈ కాలం దేవుడు! -జేబులో పట్టే వెంటిలేటర్ తయారుచేసాడు!!.

ఆపత్కాలంలో ఆదుకునేవాడు దేవుడు. అలాంటి మహానుభావుడే రామేంద్ర ముఖర్జీ. ఈయన కరోనా సమయంలో ప్రతీఒక్కరికీ ఉపయోగపడే వస్తువును చాలా చిన్న పరిమాణంలో అందించడం మరో విశేషం. అదే పాకెట్ సైజ్ మినీ వెంటిలేటర్. అసలు ఆస్పత్రి వెంటిలేటర్ కోసం రెండో వేవ్ లొ జనం ఎలా పరుగులుపెట్టారో ఎన్ని లక్షలు ఖర్చుపెట్టారో చూసాం. దేశం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న వేళ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఎంతలా వేధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Ramchandra lal mukharjeeమొదటి దశ తో పోల్చి చూస్తే రెండవ దశ వైరస్ ఎంతగానో ప్రభావం చూపడం తద్వారా ఇక ఎంతో మంది వైరస్ బారిన పడినవారిలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు తలెత్తి చివరికి ఆసుపత్రులకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే ఆసుపత్రుల్లో ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు రోజురోజుకీ వైరస్ కేసులు పెరిగిపోతున్న సమయంలోనే దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధించింది.

కరోనా వైరస్ బారిన పడిన రోగులు ఆంబులెన్స్ లో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో  తీసుకోవడంలో ఇబ్బందులు బాధపడ్డారు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పాకెట్లో పట్టే ఒక మినీ వెంటిలేటర్ను తయారు చేసారు డాక్టర్ రామేంద్ర లాల్ ముఖర్జీ. శ్వాస సమస్యతో బాధపడుతున్న వారికి ఇంటి నుంచి ఆస్పత్రి వరకు మినీ వెంటిలేటర్ ఎంతగానో ఉపయోగపడు తుందని రామేంద్ర లాల్ ముఖర్జీ తెలియజేసారు. ఈ వెంటిలేటర్ పేటెంట్ రైట్స్ కోసం అప్లై చేసుకున్నట్లు ఆయన తెలిపారు.