చూడచక్కని రూపం.. అంతకు మించి నటనలో అద్భుత ప్రతిభ.. దాంతో అవకాశాలు వరుస కట్టాయి. ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా గడుపుతుండగా.. పిడుగులాంటి వార్త.. క్యాన్సర్ మహమ్మారి దాడి చేసింది. ఆ పేరు వినగానే.. ఇక మన జీవితం అయిపోయిందని బాధపడతాం. చికిత్స తీసుకుంటే తగ్గుతుంది.. కానీ ముందు మనలోని భయం వల్ల ఆ పరిస్థితిని దాటలేం అని అనిపిస్తుంది. అయితే సదరు నటి క్యాన్సర్ వచ్చిందని భయపడలేదు. ధైర్యంగా ఎదురు నిలబడి.. పోరాడింది. క్యాన్సర్‌ని జయించింది. అయితే విధి ఆమెను పగబట్టింది. మరోసారి క్యాన్సర్ ఆమెపై దాడి చేసింది. ఈ సారి కూడా అంతే ధైర్యంగా పోరాడి గెలిచింది. కానీ ఆమెను మరింత పరీక్షించాలని భావించింది కాలం. దానికి తగ్గట్టుగానే మరోసారి ఆమె ఆరోగ్యం విషమించి.. ప్రాణాంతక స్థితికి చేరుకుంది. కోమాలోకి వెళ్లి.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ.. ప్రాణాల కోసం పోరాడుతుంది. ఆ వివరాలు..
బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ.. చక్కని రూపం.. దానికి తగ్గట్టుగానే అద్భుతమైన నటనతో ఎందరినో తన అభిమానులుగా చేసుకుంది. అంతేకాక.. జుమూర్, భోలో, బాబా పర్ కరేగా లాంటి చిత్రాల్లో నటించి.. ఎంతో ఆదరణ దక్కించుకుంది. కెరీర్లో విజయవంతంగా సాగి పోతుండగా.. క్యాన్సర్ బారిన పడింది. అలా ఒక్కసారి కాదు.. రెండు సార్లు క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించింది. ఆమె మనోధైర్యం చూసి.. అందరూ ఆశ్చర్యపోయారు. క్యాన్సర్ బాధితులు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని భావించారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఐంద్రీలా తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. తాజాగా ఆమెకు స్ట్రోక్ రావడంతో.. ఆస్పత్రిలో చేరింది.
సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా ఆమె శరీరంలో కొంత భాగం పక్షవాతానికి గురైందని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా ఐంద్రీలా శర్మ శరీరంలో కొంత భాగం పక్షవాతానికి గురైందని వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోమాలోకి వెళ్లిందని.. మెదడులో అక్కడక్కడ రక్తం గట్టకట్టిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. ఐంద్రీలా శర్మ ఇంత చిన్న వయసులోనే ఇన్ని సమస్యలు ఎదుర్కొవడం పట్ల బెంగాలీ ప్రేక్షకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
గతంలో రెండు సార్లు.. కీమోథెరపీల ద్వారా సర్జరీల ద్వారా ఐంద్రీలా శర్మ క్యాన్సర్‌ని జయించింది. ఆమె బెంగాలీలో పలు చిత్రాలతో పాటు.. ఓటీటీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఐంద్రీలా శర్మ.. తోటినటుడు సవ్యసాచి చౌదరితో డేటింగ్ చేస్తోంది. ప్రస్తుతం పలు సినిమాలు, ఓటీటీ ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతున్న సమయంలో ఇలా స్ట్రోక్ వచ్చి.. ఆస్పత్రి పాలవ్వడం విచారకరం అంటున్నారు.