జీన్స్ ప్యాంట్ సహా చాలా ప్యాంట్లకు చిన్న జేబులు ఉంటాయి. వీటిని డిజైన్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం మీకు తెలుసా?
జీన్స్ ప్యాంట్లు లేదా ట్రౌజర్స్ గానీ లేదా వేరే ప్యాంట్లు ఏదైనా చూస్తే కనుక ముందు రెండు, వెనుక రెండు జేబులతో పాటు అదనంగా చిన్న జేబు ఒకటి ఉంటుంది. కొన్ని ప్యాంట్లుకి కుడి జేబు పైన ఉంటే, కొన్ని ప్యాంట్లుకి బెల్ట్ పెట్టుకునే తుంటి కింద ఉంటుంది. ఇది కూడా జేబు పైనే ఉంటుంది. ఇది ఎందుకు పెడతారో తెలుసా? దీని ఉపయోగం ఏంటి? ఏంటి ఈ చిన్న జేబుకి కూడా ప్రత్యేకత ఉందా? అంటే ఉంది మరి. జేబులు ఊరికే కనిపెట్టలేదు. దాని వెనుక కూడా కారణం ఉంది. ఏవో సమన్లు పెట్టుకుంటారని జేబులు కనిపెట్టారు. మరి ఏం పెట్టుకోవడానికని చెప్పి ఈ చిన్న జేబులను కుడుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా?
వివిధ బ్రాండ్లు చిన్న జేబుని పెడుతుంటాయి. ఈ చిన్న జేబుల వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ప్రస్తుత జనరేషన్ కి చెందిన కొంతమంది తాళం చెవులు, అగ్గిపెట్టెలు, నిరోధ్ లు, టికెట్లు వంటి చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అని అంటారు. కొంతమంది అయితే ఎవరికైనా ప్రపోజ్ చేసే ముందు ఉంగరం ఆ చిన్న జేబులో పెట్టుకోవడానికో లేదా చేతులు కడుక్కునే ముందు ఉంగరాన్ని చిన్న జేబులో పెట్టుకోవడం కోసమో వాడుకోవచ్చునని చెబుతారు. అయితే ఆ జేబుల్లోంచి ఆ వస్తువులను తీసుకోవడం కూడా కష్టమవుతుంది. మరి ఎందుకు ఈ జేబులను పెట్టినట్టు? అయితే ఈ చిన్న జేబులను పాకెట్ వాచ్ లను పెట్టుకోవడం కోసం డిజైన్ చేశారు. అప్పట్లో చేతి గడియారాలను వాడేవారు. మహాత్మా గాంధీ తన పంచెకి చేతి గడియారాన్ని పెట్టుకునేవారు.
మరి పంచె కట్టుకోవడం రాని ఇంగ్లీషోళ్ళు చేతి గడియారం ఎక్కడ పెట్టుకుంటారు. అందుకోసం ప్యాంట్లకు చిన్న జేబుని కుట్టడం స్టార్ట్ చేశారు. పాకెట్ వాచెస్ కోసం జీన్స్ ప్యాంట్లు, ఇతర ప్యాంట్ల మీద చిన్న జేబులను కుట్టేవారు. అలా 1890లో లెవిస్ కంపెనీ వెయిస్ట్ ఓవరాల్స్ పేరుతో జీన్స్ ని దింపింది. ఈ ప్యాంట్లే మొట్టమొదటిసారిగా చిన్న జేబులతో వచ్చాయి. మొదటిసారిగా పాకెట్ వాచెస్ కోసం చిన్న జేబులు కలిగిన మొదటి ప్యాంట్ ఇదే. కానీ ఇప్పుడు చేతి గడియారాలు లేకపోయినా కానీ చిన్న జేబులు మాత్రం ఇంకా అలానే వస్తున్నాయి. మరి అందం కోసం అలా డిజైన్ చేస్తున్నారో లేక అలవాటు అయిపోయి అప్డేట్ అవ్వక అలా చేస్తున్నారో తెలియదు కానీ ఇంకా చిన్న జేబులను కుడుతూనే ఉన్నారు. మరి ఈ చిన్న జేబుల్లో మీరు ఏ వస్తువులు పెట్టుకుంటారో కామెంట్ చేయండి.