సిగరెట్ అలవాటును మాన్పించే పరికరాన్ని కనిపెట్టింది ఢిల్లీకి చెందిన అంకుర సంస్థ. ఇది ప్రపంచలోనే తొలి పరికరం కావడం విశేషం. ఈ ఫిల్టర్ ద్వారా కేవలం మూడు నెలల్లోనే స్మోకింగ్ మానేయవచ్చు అని సంస్థ చెబుతోంది.
సిగరెట్ తాగితే పోతారు.. తాగకండి.. అంటే ఎవ్వరూ వినరు. ఇక సిగరెట్ తాగే వారిని ఆ అలవాటు నుంచి దూరం చెయ్యడం కత్తి మీద సాము అనే చెప్పాలి. వారిని స్మోకింగ్ నుంచి దూరం చెయ్యడానికి నానా పాట్లు పడుతుంటారు ఇంట్లోని కుటుంబ సభ్యులు. స్మోకింగ్ మాన్పించడానికి మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అవి కేవలం డబ్బు సంపాదించుకోవడానికే సరిపోతున్నాయి. ఇక సిగరెట్ అలవాటును మాన్పించే పరికరాన్ని కనిపెట్టింది ఢిల్లీకి చెందిన అంకుర సంస్థ. ఇది ప్రపంచలోనే తొలి పరికరం కావడం విశేషం.
గుండె జబ్బులకు, ఊపిరితిత్తుల వ్యాధులకు మూలకారణం స్మోకింగ్ అని మనందరికి తెలుసు. అయినా గానీ కొంత మంది ఈ అలవాటును మానలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ఐఐటీ-ఢిల్లీ అంకుర సంస్థ అత్యాధునిక గాలి వడపోత పరిష్కారంతో ఓ వినూత్న పరికరాన్ని ఆవిష్కరించింది. దాంతో ప్రపంచంలోనే స్మోకింగ్ ను మాన్పించడానికి కనిపెట్టిన ఫిల్లర్ గా ‘సిగిబడ్’ రికార్డుల్లోకి ఎక్కింది.సిగిబడ్ ను ఉపయోగిస్తూ.. కేవలం మూడు నెలల్లోనే స్మోకింగ్ వ్యవసనం నుంచి ఈజీగా బయటపడొచ్చని సంస్థ తెలిపింది. అదీకాక ఇది శాస్త్రీయంగా నిరూపితం అయిన ఫిల్టర్ ఇది.
ఈ ఫిల్టర్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన నికోటిన్ రీప్లేస్ మెంట్ థెరపీ ప్రేరణతో కనిపెట్టారు. ఇక ఇందులో ఉండే నానోఫైబర్ టెక్నాలజీ నికోటిన్ ను ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది. సిగిబడ్ లైట్, ఆల్ట్రా తోపాటు ప్రో స్థాయిలో ఒక ప్యాక్ వస్తుంది. ఇది స్మోకింగ్ ను దశలవారిగా మాన్పించడానికి దోహదపడుతుంది. ఇక ఇది మూడు దశల ప్రక్రియగా అంకుర సంస్థ వెల్లడించింది. ఇందులో 30 నుంచి 60 శాతం వరకు నికోటిన్ లైట్ స్థాయిలోనే తగ్గించబడతాయి. మరి స్మోకింగ్ మానేయాలి అనుకునే వారికి ఇది ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎంతో మంది ఈ మహమ్మారి అలవాటును మానాలి అనుకుంటారు.. కానీ మానలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికోసం ఇదో గొప్ప ఆవిష్కరణ అని చెప్పవచ్చు.