కొండచరియలు విరిగిపడి 10 మంది పర్యాటకులు మృతి.. వీడియో వైరల్!

Hill

ప్రకృతి వైపరీత్యాలనేవి ఎప్పుడెలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. అనుకోకుండా జరిగే ఈ ప్రమాదాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా రెండు చిన్నపాటి బోట్లలో షికారుకు వెళ్లిన పర్యాటకులపై కొండచరియలు విరిగిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన బ్రెజిల్ దేశంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్ దేశంలోని ఫుర్నాస్ సరస్సులో పర్యాటకులు బోటు షికారుకి బయలుదేరారు. మార్గం మధ్యలో కొండచరియలు విరిగిపడి బోటులపై పడటంతో.. ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా, దాదాపు 32 మంది గాయాలపాలైనట్లు సమాచారం. మరికొంతమంది గల్లంతు కాగా వారికోసం రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.