సృష్టిని సృటించే శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే ఉంది. అమ్మగా, తోబోట్టువుగా, భార్యగా, కూతురిగా ఒక మగాడి జీవితానికి పరిపూర్ణత తీసుకొచ్చేది ఆ స్త్రీనే. ఇంత ఎందుకు.. ఆమె పంటి బిగువున పురిటి నొప్పులను భరిస్తేనే కదా మనం పుట్టేది. అలాంటి ఓ స్త్రీ మూర్తి ఏ రూపంలో ఉన్నా గౌరవించుకోవడంలో తప్పు లేదు. కానీ.., నేటి సమాజంలో స్త్రీకి అంతటి విశిష్టత స్థానం దక్కుతోందా అంటే లేదనే చెప్పుకోవాలి. కానీ.., ఓ భర్త మాత్రం తాను పెళ్లి చేసుకున్న భార్యని విశేషంగా గౌరవించుకున్నాడు. పెళ్లి మండపంపైనే, బంధువుల సమక్షంలోనే ఆమె కాళ్ళకి నమస్కరించి స్త్రీ గొప్పతనాన్ని చాటాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.., ఇటీవల పెళ్లిల్లకు సంబంధించిన రకారకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటూ వీరు చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. ఇక పెళ్లి వేడుకల్లో కూడా కొన్ని అల్లరి పనులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వీటిలో కొన్ని నెటిజన్స్ ని ఆశ్చర్య పరుస్తుంటే, మరొకొన్ని నవ్వులు పూయిస్తుంటాయి.కానీ.., తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో వరుడు.. పెళ్లికూతురి మెడలో వరమాల వేసి.. అనంతరం ఆమె పాదాలకు నమస్కరించాడు. దీంతో పెళ్లికి వచ్చిన అతిధులు అంతా ఒక్కసారిగా షాకయ్యారు. వరుడు చేస్తున్న పని అర్థం కాక అలాగే చూస్తుండిపోయారు. ఏం పని చేస్తున్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో వరుడు తాను ఇలా ఎందుకు చేశానో చెప్పుకొచ్చాడు.
మెడలో వరమాల వేశాను కాబట్టి ఈమె నా భార్య అయిపొయింది. ఇప్పుడు నా వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది ఈమే. ఇప్పుడు నేను కట్టిన తాళికి గౌరవం ఇస్తూ.., తన వారందరిని వదిలేసి నాతో పాటు వచ్చేస్తుంది. ఇక నుండి నా ఇల్లే ఆమె ఇళ్లు. నా అమ్మ, నాన్నల బాధ్యత కూడా ఈమెదే. నాకోసం ఇన్ని త్యాగాలు చేయడానికి సిద్దమైన ఈమెని కేవలం నా భార్యగా మాత్రమే నేను చూడలేను. నా దృష్టిలో ఈమె నా ఇంటి లక్ష్మిదేవి. సాక్ష్యాత్తు ఆ మహాతల్లి రూపమే అనుకుని ఇప్పుడు నా భార్యకి నేను పాదాభివందనం చేశాను. ఇందులో తప్పు ఏముంది అంటూ పెళ్లి కొడుకు బంధువులను ప్రశ్నించాడు. దీంతో.., అక్కడకు వచ్చిన అతిధులు కూడా ఎమోషనల్ అయ్యారు. స్త్రీ పట్ల ఆ పెళ్లి కొడుక్కి ఉన్న గౌరవానికి వారంతా అతన్ని మెచ్చుకున్నారు. ఇక ఆ భార్య కూడా.. తనకి ఇంతటి సముచిత స్థానం ఇచ్చే భర్త దొరికినందుకు పొంగిపోయింది. ఆనందంతో కన్నీరు కార్చేసింది. ఏడుపు ఆపుకోలేక మండపం మీదే భర్తని కౌగిలించేసుకుంది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోను డా. అజిత్ వర్వాండ్కర్ అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా, అది తెగ వైరల్ అవుతోంది. మరి.., భార్యలో దేవతని చూసి.., ఆమె కాళ్ళకి నమస్కరించిన భర్త తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.