అమితాబ్ బచ్చన్ … పడోసన్ – సన్నీలియోన్!..

అమితాబ్‌ బచ్చన్‌ ముంబయి పశ్చిమ శివారు ప్రాంతమైన అంధేరిలో కొత్త డూప్లెక్స్‌ అపార్టుమెంట్‌ కొనుగోలు చేశారు. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా.. అక్షరాల 31 కోట్ల రూపాయలు. ఇది 5704 చదరపు అడుగులు ఉంటుందట. 34 అంతస్తుల ఈ భవనం నిర్మాణంలో ఉంది. ఇందులో ఆయన కొనుగోలు చేసింది 27, 28 అంతస్తులలో. ఈ భవనానికి ఆరు కారు పార్కింగ్‌లు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గత ఏడాది డిసెంబర్ 31న దీన్ని కొనుగోలు చేసి, ఈ ఏడాది ఏప్రిల్ 12న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ముంబైలోని అంథేరి సబర్భన్‌లో అట్లాంటిక్‌ ఏరియాలో ఈ ఇళ్లు ఉందని తెలుస్తోంది. ఇదే అపార్ట్‌మెంట్‌లో ఇదివరకే బాలీవుడ్‌ ప్రముఖులు సన్నీలియోన్‌, దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ కూడా ఫ్లాట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  అంటే సన్నీలియోన్ అమితాబ్ కి పక్కింటి అమ్మాయన్నమాట!!

39

16 కోట్లతో సన్నీలియోన్‌ ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయగా, డైరెక్టర్‌ ఆనంద్‌ రాయ్‌ 25 కోట్లతో మరో అపార్ట్‌మెంట్‌ను తీసుకున్నట్లు టాక్‌. ఇప్పటికే ముంబైలో ఆయనకు ఐదు ఖరీధైన ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్ హోస్ట్‌గా చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ సీజన్ 13 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల సోనీ టీవీ తన ట్విటర్‌ వేదికగా ‘‘సీజన్‌ 13 రిజిస్ట్రేషన్ మే 10 నుంచి ప్రారంభం కానుంది’’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమితాబ్‌ ప్రస్తుతం మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంగా వస్తున్న ‘చెహ్రే’ చిత్రంలో నటించారు. ఇమ్రాన్‌ హష్మితో కలిసి నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ‘మేడే’, ‘గుడ్‌బై’ అనే సినిమాల్లోనూ నటిస్తున్నారు.