సన్నిలియోన్ ఒకప్పుడు పోర్న్ స్టార్‌గా ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిచారు. తర్వాత కాలంలో పోర్న్ పరిశ్రమకు దూరం అయ్యారు. ప్రస్తుతం సినీ నటిగా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపుతెచ్చుకున్నారు.
సన్నిలియోన్.. ఈ పేరుతో తెలుగు ప్రజలకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు నీలి చిత్రాల తారగా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. తర్వాతి కాలంలో నీలి చిత్రాల పరిశ్రమకు గుడ్‌బై చెప్పి.. భారత దేశానికి వచ్చారు. హిందీ సినిమాతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. 2012లో వచ్చిన ‘జిస్మ్ 2’’ సినిమాతో సినిమా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. హిందీతో పాటు తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో సినిమాలు చేశారు. కరెంట్ తీగ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
ఆ తర్వాత ‘పీఎస్‌వీ గరుడ వేగ’ సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం తమిళం, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తున్నారు. నీలి చిత్రాల తార అన్న పేరుకు పూర్తిగా దూరం అయ్యారు. ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని ప్రేమగా వారిని సాదుకుంటున్నారు. తరచుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఆమెలో ఇంతలా మార్పు రావటానికి కారణం ఏంటో ఆమె తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సన్నీ లియోన్ మాట్లాడుతూ.. ‘‘ నేను అడల్ట్ స్టార్‌గా ఉన్నపుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. హిందీ బిగ్‌బాస్ నా జీవితాన్ని మార్చేసింది.
మేకర్స్ నాకు కాల్ చేసినపుడు ధైర్యం చేయలేపోయాను. ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్లు చేసి బెదిరించారు. ఇండియా వస్తే చంపేస్తామని కూడా అన్నారు. వాటికి మొదట్లో నాకు భయం వేసింది. తర్వాత ధైర్యం చేశాను. ఇండియాకు వచ్చేశాను. ఇండియాకు వచ్చాక పోర్న్ సినిమాలు చేయటం మానేశాను’’ అని అన్నారు. పోర్న్ స్టార్ నుంచి అందరూ పొగిడే ఫిల్మ్ స్టార్‌గా మారిన సన్నీ లియోన్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.