అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కొత్త ఇంట్లోకి మారారట. కోట్ల రూపాయలు పెట్టి తన అభిరుచికి తగ్గట్లుగా లగ్జరీ హౌస్‌ను ఆయన నిర్మించుకున్నారని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ ఇంటికి సంబంధించిన విశేషాలు..
అక్కినేని యువ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సమంతతో విడాకుల తర్వాత కెరీర్లో మరింత వేగం పెంచిన చైతూ.. ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘కస్టడీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. మే 12న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా మొదలుపెట్టేశారు. అయితే ఈ సమయంలోనే నాగ చైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. చైతూ తన టేస్ట్‌కు తగ్గట్లుగా ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్నట్లు అంతా చర్చించుకుంటున్నారు.
రీసెంట్గా అందులోకి చైతూ గృహప్రవేశం కూడా చేశారని సమాచారం. ఎలాంటి హడావుడి, హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా చైతూ తన కొత్త ఇంట్లోకి వెళ్లారట. నాగచైతన్య-సమంత వివాహం చేసుకున్న తర్వాత ఓ కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన విషయం విదితమే. సీనియర్ నటుడు మురళీ మోహన్‌కు చెందిన ఇంటినే వారిద్దరూ కొన్నారు. ఈ విషయాన్ని మురళీ మోహన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ హౌస్‌లోనే సామ్-చైతూ కాపురం చేశారు. అయితే విడాకుల తర్వాత చైతూ ఆ ఇంటిని వదిలి తన తండ్రి నాగార్జున వద్దకు వెళ్లిపోయారు. అనంతరం సమంతనే ఆ ఇంటిని తీసుకున్నట్లు సమాచారం. చైతూ ఎప్పటి నుంచో తన టేస్ట్‌కు తగ్గట్లుగా ఒక లగ్జరీ మోడ్రన్ హౌస్‌ను కట్టుకోవాలని ఆశపడ్డారట.
ఎట్టకేలకు అనుకున్నట్టే తండ్రి నాగ్ ఇంటికి సమీపంలోనే ఒక స్థలం కొనుక్కుని చకచకా ఓ ఇంటిని కట్టించుకున్నారట చైతూ. ఆయన ఇంటికి కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మిగిలిన స్టార్ల ఇళ్లకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ఇంటిని గ్రాండ్‌గా కట్టుకున్నారట చైతూ. గార్డెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్, థియేటర్.. ఇలా సకల సౌకర్యాలు ఉండేలా విలాసవంతమైన గృహాన్ని నిర్మించుకున్నారట. ఇటీవలే ఆ ఇంట్లోకి చైతూ ప్రవేశించినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తనకు సంబంధించిన సామాన్లను కూడా ఆ ఇంట్లోకి షిప్ట్ చేసుకున్నారని అంటున్నారు. ఇక నుంచి చైతూ ఆ లగ్జరీ హౌస్‌లోనే ఉంటారట. ఇకపోతే చాన్నాళ్లుగా చైతూ రెండో పెళ్లి, ప్రేమ గురించి పలు రకాల గాసిప్స్, రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే.