Mango : పెద్ద పెద్ద సెలెబ్రిటీలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వటం తెలుసు.. మరి మామిడి పండుకు సెక్యూరిటీ ఏంటి?.. అదేమన్నా అంత స్పెషలా?.. అని మీకు అనుమానం రావచ్చు. ఆ మామిడి పండులో అంత స్పెషాలిటీ ఏమీ లేదు. అది కేవలం మామూలు మామిడిపండే.. మరి అలాంటప్పుడు అంత పెద్ద సెక్యూరిటీ ఎందుకు అని డౌవుట్ రావచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆ సెక్యూరిటీ ఇచ్చింది ప్రభుత్వం కాదు.. తేనెటీగలు.. పకృతి సిద్ధంగా ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేయబడింది. ఓ మామిడి చెట్టు కొమ్మకు తేనె టీగలు తెట్టెను పెట్టుకున్నాయి. దాని మధ్యలో ఓ మామిడి పండు కాసింది. చుట్టూ తేనెటీగలు నిండుకోగా దాని మధ్యలో అది పచ్చగా నిగనిగలాడుతోంది.
ఆర్కే విజ్ అనే ఐపీఎస్ అధికారి ఇందుకు సంబంధించిన ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ ఈ సీజన్‌లో కాసిన మొదటి మామిడిపండు.. జెడ్ ప్లస్ సెక్యూరిటీతో’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 40 వేల మంది ఫొటోను లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ ఈ ప్రపంచంలో ఇలాంటి సెక్యూరిటీని ఎవ్వరూ కొనుక్కోలేరు’’.. ‘‘ ఆ పండు కోయాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే’’… ‘‘ నిజం.. అది చాలా ప్రమాదకరమైన సెక్యూరిటీ’’.. ‘‘ ఇది కేవలం మామిడి పండుకు మాత్రమే సాధ్యం అయింది’’.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరి మామిడి పండుకు తేనెటీగలు సెక్యూరిటీ కల్పించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలిజేయండి.
Season’s first mango with Z+ security. pic.twitter.com/j3Hap7QTRS
— RK Vij (@ipsvijrk) March 20, 2022
ఇవి కూడా చదవండి : రూపాయికే ఇడ్లి, రూపాయికే మైసూర్ బజ్జి! క్వాలిటీ, రుచిలో నో కాంప్రమైజ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.