ఓ సమస్యకి పరిష్కారమనేది క్షేత్ర స్థాయికి వెళ్లి తేల్చాల్సిన అంశం. ఓ తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకి కారణాలను కూడా ఇదే రీతిలో వెతకాలి. అప్పుడే మరోసారి అది రిపీట్ కాకుండా ఉంటుంది. సైదాబాద్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆరేళ్ళ చిన్నారి విషయంలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. అయితే.., అమాయకపు చిన్నారిని అంతమొందించిన నిందితుడు రాజు చివరికి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కానీ.., రాజు చావుతో ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టేనా? అసలు రాజుని ఇలాంటి దారుణమైన చర్యకి ప్రేరేపించిన అంశాలు ఏమిటి? అతను పెరిగిన నేపధ్యం ఏమిటి? అసలు ఆ సింగరేణి కాలనీలో ప్రజలను మత్తులో ముంచెత్తుతున్న మాయ ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోకపోతే.. ఇలాంటి సమస్యలకి శాశ్విత పరిష్కారం దొరకడం దాదాపు అసాధ్యమే. ఈ క్రమంలోనే సింగరేణి చిన్నారి ఘటనపై ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతూ.., అందరిని ఆలోచింప చేస్తోంది. ముందుగా ఆ యువకుడు రాసిన పోస్ట్ ఏమిటో యధావిధిగా చూద్దాం.
ఇది ఆ యువకుడు చేసిన పోస్ట్. ప్రతి అక్షరంలో నిజం ఉంది. ఒక్క సింగరేణి కాలనీ పరిస్థితి మాత్రమే కాదు.., మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ నుండే రాజు లాంటి మృగాలు తయారు అవుతున్నాయి. అవి మన బిడ్డల జీవితాలను చిదిమేస్తున్నాయి. మరి.. ఈ తప్పుకి ఎవరిని నిందించాలి? ఈ యువకుడి ఓపెన్ లెటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.