మనుషుల్లో మానవత్వం నశించిపోతున్న రోజులివి. సాయం చేసే చేతులు ఈ రోజుల్లో కరువు అయ్యాయనే సంఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం. ఎదుటివారికి సాయం చేయాలనే మనసున్న మనుషుల కోసం వేతుక్కోవాల్సి వస్తుంది. ఉరుకుల పరుగుల జీవితం సాగిస్తున్న ఈ రోజుల్లో స్వార్థం తప్ప.. పక్కవాళ్ల గురించి ఆలోచించే వారు తక్కువగానే కనిపిస్తారు. ఇలాంటి రోజుల్లోనూ ఈ భూమ్మీద ఇంకా మంచితనం, మానవత్వం మిగిలే ఉందని నమ్మేలా చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చెత్త కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలి జీవితాన్ని ఒక్కరోజులో మార్చేశాడు.. ఓ యువకుడు.
వీడియోలో ఉన్న దాన్ని బట్టి.. 75 ఏళ్ల వృద్ధురాలు రోడ్డుపై చెత్త కాగితాలు అమ్ముకుంటూ జీవినం సాగిస్తుంటుంది. అలా ఒకరోజు చెత్త కుప్పలో కాగితాలు ఏరుకుంటుండగా, కారులో వచ్చిన ఓ యువకుడు అక్కడకు వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు. ఆమె చెత్తకాగితాలు అమ్ముకుంటూ బతుకుతుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆ యువకుడు ఆమెను తీసుకెళ్లి కిరాణా సామాన్లు, తోపుడు బండి, కూరగాయాలు.. ఇలా అన్ని వస్తువులు కొనిచ్చి కూరగాయాలు అమ్ముకుంటూ జీవనం సాగించమని చెబుతాడు. అంతేగాదు.. ఆమెకు కావల్సిన కనీస అవసరాలన్నింటిని సమకూరుస్తాడు. ఆ అవ్వ కూడా యువకుడు చెప్పినట్లుగానే.. వెంటనే కొబ్బరికాయ కొట్టి పూజలు కూడా చేస్తుంది. ఆఖరిలో యువకుడు చేసిన పనికి సంబరపడిపోతూ అతన్ని ఆనందంగా ఆశీర్వదిస్తుంది. ఈ వీడియోను ఐఏఎస్ ఆఫీసర్ అవినాశ్ శర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూశాక నెటిజన్లలో మానవత్వం పరిమళిస్తుంది. కామెంట్లలో నీతి వ్యాఖ్యాలు బోధిస్తున్నారు. వీరి మానవత్వం ఇక్కడికే పరిమితువుతుందా? లేదా ఇలాంటి మంచి పనులు చేస్తారా? అన్నది తెలియాలి.
Humanity.🙏🙏🙏 pic.twitter.com/NUZTGEB6Cp
— Awanish Sharan (@AwanishSharan) October 18, 2022