ముందెన్నడూ లేని విధంగా ప్రపంచాన్ని సోషల్ మీడియా శాసిస్తోంది. జనం తోటి మనుషులతో కంటే సోషల్ మీడియాతోనే ఎక్కువ గడిపేస్తున్నారు. అందుకే.. ప్రపంచంలో ఏ మూల జరిగే విషయమైనా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు. వైరల్ న్యూస్, వైరల్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. వీటిని చూస్తూ.. పక్క వాళ్లకు షేర్ చేస్తూ జనం మురిసిపోతున్నారు. వాటిలో కొన్ని జనాలను ఎడ్యుకేట్ చేసేవి అయితే.. మరికొన్ని ఎంటర్టైన్ చేసివి ఉంటున్నాయి. ఆ కోవకు చెందిందే ఈ వార్త. ‘మూగ జీవాలని కనికరం లేకుండా ప్రవర్తించే మూర్ఖలుకు ఒక ఆవు నీతి కథ బోధించింది’.
వీడియోలో ఏముందంటే.. కొందరు వ్యక్తులు పగ్గంతో కట్టి ఉన్న ఒక ఆవును ముందుకు లాగుతున్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆవు వెనకాల ఉన్న ఓ వ్యక్తి.. మూగ జీవాలు కదా అన్న కనికరం లేకుండా తన్నడం, తోకను లాగడం, పదేపదే హింసించడం కనిపిస్తోంది. ఈ హింస నుంచి తప్పించుకునేందుకు ఆవు శతవిధాలా ప్రయత్నించింది. అయితే తొలుత చాలా ఓర్పుగా ఉన్న ఆవు.. ఆ తరువాత అతడిపై దాడి చేసింది. ముందున్నవారి నుంచి బలంగా పగ్గాన్ని విడిపిచుకుని మరీ అతడిని కుమ్మేసింది. నేలపై పడేసి తన కొమ్ముతో దాడి చేసింది. కిందపడేసి తొక్కేసింది. దీంతో అక్కడున్నవారంతా భయంతో అరవడం మొదలుపెట్టారు. ఈ వీడియోను @gharkekalesh అనే యూజర్ ట్విట్టర్లో పోస్టు చేయగా.. వేలల్లో లైకులు, వందల్లో కామెంట్స్ వస్తున్నాయి.
Kalesh With Animal (Cow-Gang Assemble 💪) pic.twitter.com/JaOHU7WjRo
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 13, 2022
‘మూగజీవాలన్న కనికరం లేకుండా ప్రవర్తిస్తే.. ఇలా బుద్ధి చెప్తాయంటూ..’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆవు మంచిగా బుద్ధి చెప్పింది.. ఈ దాడికి అతడు అర్హుడు’, ‘మీరు జీవులను గౌరవించలేకపోతే.. అవి కూడా మిమ్మల్ని గౌరవించవు’ అంటూ వీడియో వీక్షించిన నెటిజన్లు నీతి వ్యాఖ్యాలను బోధిస్తున్నాviralరు. అయితే.. ఈ దాడిలో గాయపడ్డ వ్యక్తిపై కూడా కొందరు సానుభూతి చూపిస్తున్నారు. ‘ఆవు ఏదైనా తింగరిపని చేసిందేమో.. అందుకే అలా చేశాడేమో’ అంటూ రెండో వైపు నుంచి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అన్న విషయం తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరలవుతోంది.