పెళ్లి విషయంలో అమ్మాయిలకు ఎన్ని ఊహలు ఉంటాయో.. అబ్బాయిలకు కూడా అన్నే ఉంటాయి. అమ్మాయిలు అందమైన రాకుమారుడి గురించి ఎలా కలలు కంటారో.. అబ్బాయిలు ఓ అందమైన రాకుమారి గురించి కలలు కంటారు. జీవితాంతం తోడుగా ఉండబోయే వ్యక్తి గురించి తమ తలపుల్లో ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు. తమ జీవితంలోకి రాబోయే భార్య అర్థంచేసుకునేది.. అన్ని విషయాల్లో తనకు తోడుగా నిలిచేది అయి ఉండాలని అనుకుంటారు. కొంచెం భావుకత్వం ఉన్న వ్యక్తులయితే కొత్తగా ఆలోచిస్తారు. తమకు కాబోయే భార్య ఎలా ఉంటుందో.. ఎక్కడ ఉంటుందో తెలియకపోయినా కవితలు రాస్తుంటారు. ఈ భావుకత్వం కొంచెం ఎక్కువయితే అది కాస్తా ప్రేమ లేఖగా మారుతుంది. తాజాగా, ఓ యువకుడు తనకు కాబోయే భార్యకు ప్రేమ లేఖ రాశాడు.
ఆమె ఎలా ఉంటుందో.. ఎక్కడ ఉంటుందో తెలియకపోయినా తన మాటల్ని, ఊసుల్ని, ఊహల్ని మూట కట్టి ఉత్తరం రాశాడు. పేర్లు, అడ్రస్ లేని ఆ వింత ప్రేమ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాబోయే భార్యకు రాసిన ఆ ప్రేమ లేఖలో ఇలా ఉంది.. ‘‘ ప్రియమైన నాకు కాబోయే భార్యకు.. నువ్వు ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో నాకు తెలీదు. నేను నిన్ను కలిసే ఆ క్షణం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. అది ఇంకెంత కాలం పడుతుందో నాకు తెలీదు. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావో లేదో కూడా నాకు తెలీదు. కానీ, నేను మాత్రం నీగురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నాను. కలలు కంటున్నాను. నేను బాధల్లో ఉన్న ప్రతీసారి నీ ఊహలే నాకు సాంత్వన ఇస్తున్నాయి. వీలైనంత త్వరగా నువ్వు నా జీవితంలోకి రా.. నీతో పంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
నేను నీకు ఎటువంటి ప్రామీస్‌లు చేయను. ఎందుకంటే.. పెళ్లి అనేదే ఓ జీవితకాలపు ప్రామీస్. నా గుండె లోతుల్లోంచి చెబుతున్నాను.. నువ్వే నా జీవితపు చివరి ప్రేమవు. నాకు పెద్దగా స్నేహితులు లేరు. నువ్వు నా జీవితంలోకి వస్తే.. నా భార్యగానే కాదు.. స్నేహితురాలిగా కూడా ఉంటావు. ఎటువంటి సందర్భంలోనూ నేను నీకంట నీరు తెప్పించను. ఇకపై నువ్వే నా ప్రపంచం.. నా ప్రేమ సామ్రాజ్యం. దేవుడు మన కలల్ని నిజం చేయాలని కోరుకుంటున్నాను. నా మనసులో నీ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు’’ అంటూ రాసుకొచ్చాడు. మరి, అమ్మాయి ఎవరో తెలియకుండానే కాబోయే భార్యకు ప్రేమ లేఖ రాసిన ఈ యువకుడిపై మీ అభప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
అమ్మాయి ఎవరో తెలీదు.. అయినా
కాబోయే భార్యకు ప్రేమ లేఖ రాసిన యువకుడు❤️🌹 pic.twitter.com/uL6ELcCCPK— venky bandaru (@venkybandaru13) January 4, 2023