viral news : నేటి ఇంటర్‌నెట్ యుగంలో సోషల్ మీడియా చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇనీ కాదు. సోషల్ మీడియా పుణ్యమా అని తిండికి గతి లేని వాళ్లు.. కూలీ పని చేసుకుని బతికే వాళ్లు రాత్రికి రాత్రే సెలెబ్రిటీలు అయిపోతున్నారు. మొన్నీ మధ్య తాపీ పని చేసే 60 ఏళ్ల వ్యక్తి మోడల్‌గా మారాడు. ఆ తర్వాత పల్లీలు అమ్ముకునే వ్యక్తి ఒక్క పాటతో ప్రపంచం మొత్తం ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా అదే జాబితాలోకి చేరుకుంది ఓ యువతి. పొట్టకూటికోసం బెలూన్లు అమ్ముకునే ఆ యువతి ఓవర్ నైట్‌లో మోడల్‌గా అయిపోయింది. వివరాల్లోకి వెళితే.. కిష్బూ అనే యువతి కేరళలోని పలు ప్రాంతాల్లో బెలూన్లు అమ్ముతూ ఉంటుంది. ఆమెది రాజస్తాన్ కుటుంబం.
వారి కుటుంబం బెలూన్ల వ్యాపారం చేయటానికి కేరళ వచ్చి స్థిరపడింది. కొద్దిరోజుల క్రితం ఆమె ఆండలూరు కువు జాతరలో బెలూన్లు అమ్ముతూ ఉంది. అప్పుడు అర్జున్ క్రిష్ణన్ అనే ఫొటోగ్రాఫర్ కిష్బూ ఫొటో తీశాడు. దాన్ని ఆమెకు, ఆమె కుటుంబసభ్యులకు కూడా చూపించాడు. వారు ఎంతో సంతోషించారు. ఆ తర్వాత ఆ ఫొటోను తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఫొటో కాస్తా వైరల్‌గా మారింది. అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అతడి స్నేహితురాలు శ్రేయ కూడా ఓ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది కూడా వైరల్‌అయింది. దీంతో ఆమెను పెట్టి పెళ్లి ఫొటో షూట్ చేయటానికి ఓ కంపెనీ ముందుకు వచ్చింది. సైలిష్ట్ రెమ్య సహాయంతో ఆమెను మరింత అందంగా తీర్చిదిద్ది ఫొటో షూట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.