ఓ మేక ఖరీదు ఎంత ఉంటుంది? ఎంత ఎక్కువ వేసుకున్నా రూ.15 వేలు ఉంటుంది. కానీ.. ఓ మేక అక్షరాల కోటి రూపాయలు అంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది అక్షరాల నిజం కాబట్టి. మరి.., కోటి రూపాయలు పలకడానికి ఆ మేకలో ఉన్న స్పెషల్ ఏమిటి? ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బక్రీద్ వచ్చిందంటే చాలు. దేశ వ్యాప్తంగా పశువుల అమ్మకాలు, కొనుగోళ్ల జోరు పెరుగుతుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని బుల్దనా జిల్లాలో సంతకి ఎక్కువగా మేకలను తీసుకొచ్చారు.
అయితే.., కాన్పూరు జిల్లాలోని రాణియా ప్రాంతానికి చెందిన దేవేందర్ కుమార్ వద్ద ఓ మేక ఉంది. ఈ మేక పేరు టైగర్. పుష్టిగా, ఆరోగ్యంగా ఉండే ఈ మేకని కొనడానికి ఒక్కొక్కరు ఇప్పుడు లక్షలకి లక్షలు చేత పట్టుకుని పోటీ పడుతున్నారు. కొందరైతే ఈ మేక కోసం ఏకంగా రూ.60 లక్షల చెల్లించడానికి కూడా సిద్దపడ్డారు. కానీ.., దేవేందర్ కుమార్ మాత్రం కోటికి ఒక్క రూపాయి తక్కవైనా మేకని అమ్మేది లేదని తెగేసి చెప్తున్నాడు.
ఈ మేక శరీరంపై ఉన్న మచ్చ.. ఉర్దూ భాషలో అల్లా పేరులా కనిపిస్తోంది. పుట్టుకతోనే ఆ మేకకి ఈ మచ్చలు ఉన్నాయి. ఈ కారణంగానే మేకకి ఇంత డిమాండ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇలాంటి మేకలు మన దగ్గర తక్కవైనా.., దుబాయ్ లో మాత్రం ఎక్కువగా కనిపిస్తాయి. చూశారు కదా? కోటి రూపాయల మేక ప్రత్యేకత. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.