రెండు హెలికాప్టర్లు ఢీ.. పలువురికి గాయాలు. వినటానికి నమ్మలేని విధంగా ఉన్న ఇది నిజం. మాములు రోడ్డుపై వాహనాలు ఢీ కొని మనుషులు చనిపోవడం, తీవ్ర గాయాలపాలవ్వడం మనం తరుచుగా చూస్తుంటాం. కానీ ఆకాశంలో చక్కర్లు కొట్టే రెండు హెలికాప్టర్లు సైతం తాజాగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయలవ్వడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఆస్ట్రేలియా క్విన్స్ లాండ్ గోల్ల్ కోస్ట్ పరిధిలోని మెయిన్ బీజ్ ప్రాంతం.
ఇక్కడే సోమవారం రెండు హెలికాప్టర్లు ఆకాశంలో ప్రయాణిస్తున్నాయి. ఇదే సమయంలో ఆ రెండు హెలికాప్టర్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. దీంతో హెలికాప్టర్ల శిథిలాలు బీచ్ ఇసుకపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇక కొద్ది సేపటి తర్వాత ఓ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఆరోగ్య సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారనే ఖచ్చితమైన సమాచారం మాత్రం తెలియరాలేదు. కాగా విమానం సురక్షితంగా ల్యాండ్ అవుతుండగా కొందరు వీడియోలు తీశారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేశారు.
#BREAKING Two helicopters collide in Southport, Australia.
3 believed to be dead, with 2 others injured as two helicopters collide near SeaWorld on the Gold Coast. Serious accident, see following tweets for updates.#Southport – #Australia@rawsalerts @IntelPointAlert pic.twitter.com/5Kjd2h33kc
— CaliforniaNewsWatch (@CANews_Watch) January 2, 2023