ఆ దేశంలో భూకంపాల ప్రభావం ఎక్కువ. దీని కారణంగా చాలా ఆస్తి, ప్రాణా నష్టం వాటిల్లుతుంది. దీంతో ఆ దేశ పార్లమెంట్ లో భూకంపం బీమా అనే అంశంపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ సభ్యులు భూకంప బీమ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ బీమ వలన కలిగే లాభా నష్టలపై సిరీయస్ గా చర్చిస్తోన్నారు. ఇంతలో ఆ పార్లమెంట్ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపిచింది. దీంతో సమావేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. భూకంపంపై చర్చ జరుగుతున్నప్పుడే భూకంపం రావడంతో చర్చ కొద్ది సమయం వాయిదా పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
యూరోప్‌లోని ఓ చిన్న దేశం లిచెన్ స్టెయిన్. ఇది ఆస్టిృయా, స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఉంది. ఈ దేశం ఆల్ఫ్స్ పర్వతాలకు సమీపంలో ఉంది. ఆ పర్వతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఫలితంగా లిచెన్ స్టెయిన్ లో కూడా భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో దేశంలో అపార ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి భూకంపాల పరిస్థితి, భీమా వంటి అంశాలపై ఆ దేశ పార్లమెంట్ చర్చకు సిద్దమైంది. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఓ పార్లమెంట్ సభ్యురాలు ప్రసంగించడం మొదలు పెట్టింది.
అప్పుడే ఒకసారి భూమి కంపించింది. దీంతో తన భ్రమేమో అనుకుని ఓ నవ్వు నవ్వేసి.. మళ్లీ తన ప్రసంగాన్ని ఆమె కొనసాగించింది. అయితే రెండో సారి మళ్లీ భూమి కంపించింది. ఆమె పక్కనే ఉన్న వాటర్ బాటిల్ సైతం కదిలాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.1గా చూపించింది. పార్లమెంట్ లో చర్చ జరుగుతోన్న సమయంలో భూకంపం రావడం సీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
You couldn’t make this up. An earthquake in Liechtenstein has interrupted a debate in Liechtenstein’s state parliament about…earthquakes. #Erdbeben #Liechtenstein #earthquake pic.twitter.com/zzObnJ4598
— Piebe-Guido van den Berg (@TeamSuomi) September 1, 2022
🔔#Earthquake (#Erdbeben) M4.0 occurred 19 km S of #Dornbirn (#Austria) 6 min ago (local time 13:57:45). More info at:
📱https://t.co/LBaVNedgF9
🌐https://t.co/UqEiar3OhB
🖥https://t.co/Mh8lVKeg49 pic.twitter.com/SZsEvxK7Sy— EMSC (@LastQuake) September 1, 2022