లైంగికంగా పాల్లొన్నప్పుడు కొందరు HIV లాంటి ప్రమాదకరమైన వైరస్ రాకుండా కండోమ్ లను వాడతారని మన అందరికీ తెలిసిందే. కానీ పశ్చిమ బెంగాల్ లోని కొందరు కుర్రాళ్లు మాత్రం కండోమ్ లను ఎగబడి ఎగబడి కొంటున్నారట. అవును మీరు విన్నది నిజమే. కానీ వాళ్లు కొనే కండోమ్ లు మాత్రం శృంగారంలో పాల్గొనడానికి కాదట. మరీ దేనికి అని ఆలోచిస్తున్నారా? అసలు విషయం ఏంటంటే? పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు మెడికల్ షాపుకు వెళ్లి కండోమ్ లను విచ్చలవిడిగా కొంటున్నారు.
అలా కొన్న ఆ కండోమ్ లను రాత్రం వేడి నీటిలో నానబెట్టి మరుసటి రోజు నానబెట్టిన నీటి లోంచి కండోమ్ లను తీసేసి ఆ నీటిని తాగుతున్నారట. ఇదే అంశం స్థానికంగా తీవ్రచర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఈ యువకులు అలా నానబెట్టిన నీటిని ఎందుకు తాగుతున్నారని ఆరా తీయగా వేడి నీటిలో కండోమ్ లను నానబెట్టగా ఆ నీరు మొత్తం ఆల్కహాలిక్ స్వభావం ఉన్న నీరులా మారిపోతాయట. దీంతో ఆ నీటిని తాగి యువకులు మత్తుని ఆస్వాదిస్తున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. స్థానికంగా ఉండే యువకులు, కాలేజీ స్టూడెంట్స్ అంతా ఈ అలవాటుకు బానిసై తెగ రెచ్చిపోతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. కండోమ్ లను మత్తు కోసం వాడుతున్న ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: 28 మంది మహిళలు.. 500కు పైగా కండోమ్లు.. దడపుట్టిస్తున్న చీకటి వ్యభిచారం!