ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ప్రాంతం, భాషతో అస్సలే సంబంధం లేదు. ఇద్దరు మనుషులు, వారి మనసులు ఏకమై ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో మాత్రం ఓ 18 ఏళ్ల యువతి 61 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. ఇంతటితో ఆగకుండా అతనినే పెళ్లి చేసుకుని ప్రేమంటే ఇదేరా అంటూ ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ లోని రావల్పండిలో 61 ఏళ్ల రానా శంషాద్, 18 ఏళ్ల ఆషియా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇదే జంట గురించి యావత్ ప్రపంచ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.
ఇటీవల ఓ మీడియాతో మాట్లాడిన ఈ జంట తమ ప్రేమ ఎలా మొదలైందనే వాటిపై పూర్తిగా వివరించారు. రానా శంషాద్ గురించి అతని ప్రియురాలు ఆషియా మాట్లాడుతూ.. రానా శంషాద్ పేదరికంలో ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపేవాడు. దీంతో అతను ఓ రోజు మా ప్రాంతంలో అడుగు పెట్టాడు. అప్పుడు మా కాలనీలోని అందరూ అతని మంచి తనం గురించి చర్చించుకునేవారు. అప్పుడు అతనిపై నాకు ఆసక్తి పెరిగింది. ఒకటి రెండు సార్లు అతనిని నేను కలిశాను.
ఇది కూడా చదవండి: Nandyala: మైనర్ల ‘ప్రేమకథ’.. అసలేం జరిగిందంటే?
ఇక ఎలాగైన అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని ఆషియా తెలిపింది. ఇక అనంతరం రానా శంషాద్ మాట్లాడుతూ.. మా వయసు వ్యత్యాసం వలన చాలా మంది ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. దీంతో నేను ఆషియాతో పెళ్లి చేసుకుంటానని తెలుసుకున్నాక మా బంధువులు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అడ్డంకులు కలగజేశారని అన్నాడు. ఇక ఏదేమైనా మా ప్రేమ గురించి ఎక్కువగా చర్చించడం మాకు ఇష్టం లేదు. ఎవరేం చెప్పినా కూడా వినడానికి సిద్దంగా లేను అంటూ రానా శంషాద్ తెలిపారు. వీరి ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.