హీరోయిన్ అంటేనే గ్లామర్. కట్టుబొట్టుతో కనికట్టు చేసినా, కుర్రకారు మదిని దోచేదీ గ్లామరస్ లుక్స్ తోనే. సినిమాలతోనే కాకుండా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా నెటిజన్లకు, అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటారు. ఫోటో షూట్లతో అందాల ఆరబోత చేస్తారు. అలా ఓ హీరోయిన్ ఫోటో ఒకటి సెగలు పుట్టిస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది హీరోయిన్లు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొంత మంది నటన, టాలెంట్, కట్టుబొట్టులతో ఆకట్టుకుంటే, మరికొంత మంది గ్లామర్ లుక్స్ తో కట్టిపడేస్తారు. వచ్చిన తొలి సినిమాతో కొంత మంది పేరు తెచ్చుకుంటే.. మరికొంత మంది కొన్ని సినిమాలకు పేరు రాక, ఐరన్ లెగ్ అని ముద్రపడి చిత్ర సీమ నుండి దూరమతారు. లేదంటే మరో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడతారు. అక్కడ ఫెయిల్యూర్ చవిచూస్తే మరో రంగంలోనో లేదా ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్లిపోతుంటారు. కొంత మంది హీరోయిన్స్ కు ఫ్లాఫ్స్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు క్యూ కడుతుంటాయి. అలాంటి హీరోయిన్లలో ఈమె కూడా ఒకరుు.
సినిమా హిట్ కొట్టాలంటే హీరో పాత్ర ఎంత కీలకమో హీరోయిన్ కూడా అంతే. అయితే నటనతో పాటు గ్లామర్ లుక్ లో కనిపిస్తేనే హీరోయిన్ కు మంచి మార్కులు పడతాయి. అందుకే ప్రతి హారోయిన్ గ్లామర్ పాత్ర చేయాలని భావిస్తుంటారు. ఒకే వేళ తెరపై సాధ్యం కాకపోతే.. ఫోటో షూట్లతో గ్లామర్ ను ఒలబోస్తారు. తాజాగా ఓ హీరోయిన్ తన ఫోటో షూట్ చేసి నెటిజన్లకు హీట్ పుట్టిస్తున్నారు. ఇంతకూ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా.. ఇంకెవరండీ ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ. కేతిక పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ నటించిన రొమాంటిక్ మూవీ ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమాతోనే ఈ అమ్మడులో ఏదో విషయం ఉందని అనిపించేలా చేశారు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు.
నాగశౌర్యతో నటించిన లక్ష్య చేయగా.. అది కూడా బెడిసి కొట్టింది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ తో నటించిన రంగ రంగ వైభవంగా కూడా చతికిల పడింది. మూడు సినిమాల పరాజయంతో స్టార్ హీరోయిన్ గా ఎదగాలన్న ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయినప్పటికీ నెటిజన్లను తన అంద చందాలతో అలరిస్తూ ఉంటుంది ఈ రొమాంటిక్ భామ. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రాల గుండెల్ని పిండేస్తుంది. తాజాగా ఓ ఫోటో పోస్టు చేయగా వైరల్ గా మారింది. అందులో అమ్మడు కాక పుట్టిస్తోంది. బాత్రూమ్ లో ఫ్యాంట్ జిప్ తీసేసినట్లుగా కనిపిస్తూ, తన బొడ్డును ప్రదర్శిస్తూ, హాట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది. ఈ ఫోటోను చూసిన వారంతా ఫైర్ సింబల్ జత చేస్తున్నారు. అరే ఏసీ ఆన్ చేయండ్రా బాబూ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
చదువు పూర్తయ్యాక మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన కేతిక.. థగ్ లైఫ్ అనే వీడియోతో పాపులర్ అయింది. డబ్ స్మాష్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలతో సినిమాలోకి అడుగుపెట్టక ముందే సూపర్ క్రేజ్ ను సంపాదించింది. మూడు సినిమాలు ఫెయిల్యూర్ అయినా ఆఫర్లకు కొదవలేదు ఈ భామకు. తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంపికయినట్లు వినికిడి. హాట్ ఫోటో షూట్ లతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న ఈ బ్యూటీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.