షెర్లిన్ చోప్రాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె ఓ షాపింగ్ మాల్‌లో హల్‌చల్ చేశారు. ఓ యువకుడి వీపుపై ఎక్కి చక్కర్లు కొట్టారు.
షెర్లిన్ చోప్రా.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ, ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ సినిమా హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. 2005లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సప్పెన్స్ సైకో క్రైం థిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో షెర్లిన్ చోప్రాకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో ఈమె మొత్తం 3 సినిమాలు చేశారు. 2002లో వచ్చి ‘వెండి మొబ్బు’ అనే తెలుగు సినిమా హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సమ్ థింగ్ స్పెషల్ ఆమె చివరగా నటించిన తెలుగు సినిమా.
ఈ సినిమా తర్వాత హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బిజీ అయిపోయారు. తమిళంలో కూడా ఆమె సినిమాలు చేశారు. ప్రస్తుతం చేతిలో ఏ సినిమాలు లేవు. సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయిపోయారు. ఆమె తన చేష్టలతో తరచుగా మీడియాలో నిలుస్తున్నారు. తాజాగా, ఆమె ఓ షాపింగ్ మాల్లో హల్ చల్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఆమె షాపింగ్ మాల్‌కు వెళ్లారు. అక్కడ ఓ యువకుడి వీపుపైకి ఎక్కి సవారీ చేశారు. అంతటితో ఆగకుండా డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..
షెర్లిన్.. రాఖీ సావంత్ చెల్లెలిలా ఉంది’’.. ‘‘ నువ్వు ఎన్ని చేసినా.. రాఖీ సావంత్ లెవల్‌లోకి రాలేవు’’.. ‘‘ షెర్లిన్.. పెట్రోల్ తాగావా ఏంటి?’’ అని ప్రశ్నిస్తున్నారు. కాగా, షెర్లిన్ చోప్రా హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. మిస్ ఆంధ్రగా 1999లో కిరీటాన్ని గెలుచుకున్నారు. అయితే, ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమె నటనా జీవితాన్ని ఇబ్బందుల్లో పడేశాయి. ప్రస్తుతం సినిమాల్లో కంటే.. వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. మరి, వైరల్‌గా మారిన షెర్లిన్ చోప్రా వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.