ఈ సృష్టిలో అన్ని బంధాల కన్న విలువైనది, నమ్మకమైనది స్నేహ బంధం. దీని కోసం స్నేహితులు ఎందాకైన వెళ్తారనేది అందరికి తెలిసిన అక్షర సత్యం. కుల, మత భేదాలు లేనిది, పేద ధనిక తారతమ్యాలు చూడనిది, బంధుత్వాల కన్న గొప్పది స్నేహం ఒక్కటే. అయితే ఇద్దరు స్నేహితుల మధ్య సాగిన బంధంలో ఏనాటికైన తప్పులు ఒప్పులు జరగటం సర్వసాధరణమే. కానీ ఆ తప్సు ఒప్పులను సరి చేసుకోకుండా చాల మంది స్నేహితులు విడిపోతు ఉంటారు.
ఇదే కాకుండా కలిసి మెలిసి ఉన్న స్నేహంలో కొందరు మనుషులు స్వార్ధ ప్రయోజనాల కోసం నమ్మక ద్రోహం చేస్తూ తన దారి చూసుకుని పక్కకు జరుగుతున్న ఘటనలో ఎన్నో చూసి ఉంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే..? ఇలాంటి నమ్మక ద్రోహం అనేది మనుషుల్లోనే కాకుండా జంతు జీవుల్లో కూడా ఉంటాయనేది ఈ వీడియో చూస్తే అర్ధమవుతోంది. అయితే ఈ వీడియోలో మూడు చీమలు కలిసి మెలిసి ప్రయాణిస్తూ ఉంటాయి. అలా వెళ్తున్న క్రమంలో దారిలో ఓ ఆకు అడ్డుగా వస్తుంది. దీంతో ముందు ఓ చీమ రెండు చీమలు ఎక్కటానికి సాయం చేస్తుంది.
ఆ తర్వాత పైకి ఎక్కిన చీమలు మొదటగా సాయం చేసిన చీమ గురించి పట్టించుకోకుండా వదిలేసి అలా ముందుకెళ్లాయి. దీంతో సాయం చేస్తాయనే నమ్మకంతో ఆశగా ఎదురు చూసిన ఆ చీమకు నిరాశే ఎదురైంది. ఎన్నో అర్థాలు తెలియజేస్తున్న ఈ వీడియో నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ నమ్మకద్రోహంతో చీమలు కట్టప్పను మించిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంత మంది నెటిజన్స్ మనుషుల్లోనే నమ్మక ద్రోహులు ఉంటారనుకున్నా.. జంతువుల్లో కూడా ఉంటాయా అంటూ కామెంట్ చేశారు.
This is the saddest movie ever made pic.twitter.com/UmEjS1Fpip
— Ben Phillips (@benphillips76) October 20, 2021