సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవడానికి ఎంత బాగుంటుంది. మా ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, మా అల్లుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవడానికి చాలా మంది గర్వంగా ఫీలవుతుంటారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయితే లక్షల్లో ప్యాకేజీ, శని, ఆదివారాలొస్తే సెలవులు, అదృష్టం బాగుంటే అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో లివింగు అబ్బో చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయని అభిప్రాయపడుతుంటారు. అందుకే తమ ఆడపిల్లలకి సాఫ్ట్ వేర్ అబ్బాయి వరుడిగా కావాలని కోరుకుంటారు. కానీ విచిత్రంగా ఒక కుటుంబం మాత్రం తమ కూతురికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వద్దే వద్దంటున్నారు. ఎవరా మహానుభావులు అని అనుకుంటున్నారా? ఎ..లెగేస్ వెధవ సోది, పాయింట్ కి రా అని లెజెండ్ లో బాలకృష్ణలా ఫైర్ విల్ బి ఫైర్ అవ్వకముందే మేటర్ లోకి వెళ్ళిపోదాం.
వివరాల్లోకి వెళ్తే.. తమ పిల్లలకి పర్ఫెక్ట్ జోడీ కోసం మాట్రిమోనీ వంటి వాటిలో ప్రకటనలు ఇస్తుంటారు. ఈ క్రమంలో ఒక ధనిక ఫ్యామిలీ కూడా తమ ఇంటి ఆడ కూతురికి సరైన జోడి కోసం ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ గా మారేంత సీన్ ఆ ప్రకటనలో ఏముంది అంటే.. “వ్యాపార నేపథ్యం ఉన్న ధనిక కుటుంబంలో పుట్టి.. ఎంబీఏ చేసిన అందమైన అమ్మాయికి.. ఐఏఎస్/ఐపీఎస్, డాక్టర్(పీజీ), పారిశ్రామికవేత్త/వ్యాపారవేత్త ఎవరో ఒకరు వరుడిగా కావాలి. ఆడు మా కులపోడు అయి ఉండాలి. అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాత్రం వద్దు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ దయచేసి కాల్ చేయకండి” అని ప్రచురించి ఉంది. ఈ ప్రకటనకు సంబంధించిన ఇమేజ్ ను ‘సమీర్ అరోరా’ అనే నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాదు “ఐటీ భవిష్యత్తు అంత బాగా లేదు” అంటూ రాసుకొచ్చారు.
ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైర్ల అయ్యింది. దీంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కడుపు మండింది. ఏ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అంత తీసిపోయారా? మా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అంటే అంత లోకువైపోయామా? అసలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లేకపోతే దేశం ఏమవుతుందో తెలుసా? బోగీలకి రైలింజన్ ఎలాగో దేశానికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అలాగా. మీకర్ధమవుతుందా” అంటూ సాఫ్ట్ వేర్ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే వయసు ఎక్కువై సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకి పిల్లనివ్వడం లేదని బాధపడుతుంటే.. గొంతులో వెలక్కాయ పడ్డట్టు ఇప్పుడీ మినీ స్టేట్మెంట్ ఒకటి మా కడుపు కొట్టడానికి” అని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదన్నమాట విషయం. మరి తమ కులపోడు అయినా గానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వద్దంటున్న ఈ బిజినెస్ ఫ్యామిలీపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2
— Samir Arora (@Iamsamirarora) September 16, 2022