ప్రేమించడం కష్టం కాదు. ఆ ప్రేమని ప్రియురాలికి తెలియ చేయడంలోనే అసలు కష్టం దాగి ఉంటుంది. మాసుల్లో ప్రేమని బయటకి చెప్పుకోలేక ఒంటరిగా మిగిలిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్న ఓ ప్రేమికుడు తన ప్రియురాలికి చాలా విచిత్రంగా ప్రపోజ్ చేశాడు. ఆ యువతికిపానీపూరి అంటే ప్రాణం. ప్రతిరోజులానే ఆ రోజు కూడా ఆమెని పానీపూరికి తీసుకెళ్లాడు ఆ స్నేహితుడు. అక్కడే వారు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అయితే, అప్పటికే ఆ యువకుడు తన ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. షాపువారు.. ఒక ప్లేట్‌లో కొన్ని గప్‌చుప్‌లు, మసాలా, బటానీ పెట్టిచ్చారు. అది తీసుకున్న ఆ ప్రేమికుడు ఒక గప్‌చుప్‌లో బంగారు ఉంగరాన్ని పెట్టి ఆ ప్లేటును ఆ యువతికి ఇచ్చాడు. యువతి ఆ గప్‌చుప్ ప్లేటును చూసి షాక్ అయ్యింది.
తన స్నేహితుడు తనకి ఈ విధంగా ప్రపోజ్ చేసినట్టు ఆమెకి అర్ధం అయ్యింది. నిజానికి ఈ వెరైటీ సర్‌ప్రైజ్‌కి ఆ యువతికి తెగ నచ్చేసింది. దీంతో.., ఆమె మోహంలో నవ్వు వచ్చి చేరింది. ఆ యువతి కూడా సరిగ్గా పానీపూరీ బండి దగ్గరే తన ప్రియుడి ప్రపోజల్‌కి ఒకే చెప్పేసింది. అయితే, ఇది ఎక్కడ జరిగిందో తెలియలేదు. ఈ క్లిప్పింగ్‌లను ట్విట్టర్‌లోని ‘మంత్లీ అందాజ్ ఇ జాన్’ అనే పేజీలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్నిచూసిన నెటిజన్లు మీ.. ఐడియా సూపర్.. పానీపూరీకి ఏ అమ్మాయి నో చెప్పలేదు. అలాంటి పానీపూరిలో రింగ్ పెట్టి ప్రపోజ్ చేస్తే.. ఇక ఎలా అంటారు? అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.