ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు.. బర్త్ డే పార్టీలు.. దావత్ లాంటివన్నీ డీజే డ్యాన్సులు లేకుండా కనిపించడం లేదు. మొన్నటి బుల్లెట్టు బండి దగ్గరినుండి నిన్నటి జై బాలయ్య, సామీ సామీ.. వరకు అన్ని వేడుకలో దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. అలాగే నేటితరం పిల్లలు కూడా వేడుకల్లో డ్యాన్స్ చేసేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ పాప చేసిన తీన్మార్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ పెళ్లిలో ఇద్దరు అబ్బాయిలతో పోటీపడి ఆ చిన్నారి డ్యాన్స్ ఇరగదీసింది. 2011లో తమన్ సంగీతం అందించిన మాస్ సాంగ్ ‘మంబత్తియాన్’ పాటకు ఓ రేంజిలో నాన్ స్టాప్ చిందేసింది ఆ చిన్నారి. తన డ్యాన్స్ తో పెళ్లికి వచ్చిన వారందరిలో ఫుల్ కిక్కు నింపింది. ప్రస్తుతం ఆ పాప డ్యాన్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓవైపు పాప డ్యాన్స్ అదరగొట్టిందని నెటిజన్లు కొనియాడుతుండగా.. ఇదంతా మా తమన్ అన్న మేనియా అంటున్నారు కుర్రకారు. మరి ఈ చిన్నారి డ్యాన్స్ పై మీరు కూడా ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Damn that little girl🔥🔥 pic.twitter.com/r1MFxvGJ9Y
— Miss Disappear! (@_SecretStalker_) March 24, 2022