Viral Video: ఈ మధ్య కాలంలో పెంపుడు కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. మొన్నీ మధ్య ఓ పెంపుడు కుక్క లిఫ్టులో బాలుడ్ని కరిచింది. మరో కుక్క లిఫ్టునుంచి బయటకు వచ్చిన ఓ డెలివరీ బాయ్‌ని కరిచింది. ఈ రెండు సంఘటనలే కాదు.. చాలా సంఘటనలు ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్నాయి. పెంపుడే కుక్కలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి అనుకుంటే.. కొన్ని వీధి కుక్కలు వాటి కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. గుంపులుగా మనషుల్ని వేటాడుతున్నాయి. పరిగెత్తించి మరీ దాడి చేస్తున్నాయి. ఈ సంఘటనలు కేరళలో ఆలస్యంగా వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కన్నూర్‌లో ఓ ఇళ్లు ఊరికి దూరంగా ఉంది.
అక్కడే కొన్ని కుక్కలు గుంపుగా మారాయి. ఆ ప్రాంతంలోని వారిపై దాడి చేయటం మొదలుపెట్టాయి. తాజాగా, ఓ ఇద్దరు కుర్రాళ్లను పట్టపగలు వెంటాడాయి. వాళ్లు ఆ కుక్కలనుంచి తప్పించుకోవటానికి ప్రాణ భయంతో పరుగులు తీశారు. అవి వారి వెంటపడి తరుముతూనే ఉన్నాయి. వారు క్షణాల్లో అక్కడే ఉన్న ఓ ఇంటి ఆవరణలోకి దూరారు. ఠక్కున గేట్ వేసేశారు. గేట్ పడగానే కుక్కలు ఆగిపోయాయి. వెంటనే వెనక్కు పరుగులు తీశాయి. ఆ ఇద్దరు యువకులు బతుకు జీవుడా అనుకున్నారు. అయితే, కుక్కల ఆరాచకం అంతటితో ఆగలేదు. రాత్రిళ్లు ఆ ఇంటి దగ్గర కాపు కాస్తున్నాయి.
కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి ఓ మహిళ ఆ ఇంటి వైపు వస్తూ ఉంది. అక్కడే మనుషుల కోసం నక్కి కూర్చున్న కుక్కలు ఆమె వాటి దగ్గరకు రాగానే మీదకు ఉరికాయి. ఆమె భయంతో అరుస్తూ అక్కడినుంచి పరుగులు తీసింది. ఆ కుక్కలు ఆమెను వదల్లేదు. ఆమె వెంట పడి పరిగెత్తించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. కుక్కల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి, కుక్కలు, మనుషుల్ని వేటాడుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WATCH | Kerala: Students in Kannur manage to escape unharmed as stray dogs chase them in the locality (12.09) pic.twitter.com/HPV27btmix
— ANI (@ANI) September 13, 2022
ఇవి కూడా చదవండి : కదులుతున్న రైలులో గర్భిణీకి పురుడు పోసిన వైద్య విద్యార్థిని! ఎక్కడంటే?