సాధారణంగా విమానాలు/హెలికాఫ్టర్ లంటే పైలట్ ఉంటేనే గాల్లో ప్రయాణిస్తాయని అందరికి తెలిసిందే. తాజాగా అమెరికాకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ లో భాగంగా కంప్యూటర్ ఆపరేటెడ్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ని ట్రయిల్ రన్ చేశారు అధికారులు. ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించిన ఈ ఛాపర్ దాదాపు 30 నిమిషాల పాటు కెంటుకీ నగరంలో దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో గంటకు 115 – 125 మైళ్ల వేగంతో ప్రయాణించినట్లు సమాచారం. ఈ హెలికాఫ్టర్ కి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.ఇది స్వయం ప్రతిపత్తితో ప్రయాణించే విమానం. యూఎస్ లోని కెంటుకీ రాష్ట్రంలో బ్లాక్ హాక్ హెలికాప్టర్ పైలట్ లేకుండా ప్రయాణించి వార్తల్లో నిలిచింది. ఈ ఛాపర్ ని రూపొందించడానికి మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయట. భద్రత కల్పిస్తూ భూభాగంలోకి దూసుకెళ్లడం, విపత్తులను నివారించడం, ఖర్చు తగ్గింపు అనేవి ప్రధాన లక్ష్యాలుగా చెబుతున్నారు. ఈ ఛాపర్ ఆర్మీకి వీలుగా పని చేయనుంది. అదీగాక ఇది పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని వేళల్లో పైలట్ రహిత హెలికాప్టర్ సులభంగా ప్రయాణించనుంది. ప్రస్తుతం మరి పైలట్ లేకుండా ప్రయాణించే ఈ ఛాపర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
WATCH: A Black Hawk helicopter flew for the first time without pilots in Kentucky. The aircraft flew for 30 minutes through a simulated cityscape avoiding imagined buildings before performing a perfect landing pic.twitter.com/SD01LWhUZe
— Reuters Asia (@ReutersAsia) February 12, 2022