నేటి సమాజంలో పెళ్లిళ్లంటే ఆటల్లాగ అయిపోయాయి. తమ ఇష్టం వచ్చినట్లు జీవితభాగస్వాములను ఎంచుకోవడం.. కుదరక పోతే విడిపోవడం సాధారణమైపోయింది. ప్రకటనలలో కండిషన్స్ పెట్టి వధూవరులను వెతుకుతున్నారు.
పెళ్లి అంటే నూరేళ్ల పంట అని అనేవారు పెద్దలు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే భార్యాభర్తలు విడిపోకుండా జీవితాంతం కొనసాగాలని పెద్ద వారు చెబుతుండేవారు. కష్టంలోనైనా, సుఖంలోనైనా పాలు పంచుకుని దంపతులు కాపురం చేయాలని ఆశపడేవారు. కాపురంలో కొట్లాటలు వస్తే అటువైపువారు, ఇటువైపు పెద్దవారు సర్ది చెప్పి వారిని మరల ఒక్కటి చేసేవారు. కానీ ఇప్పటి యువత పెళ్లికున్న విలువలు తెలుసుకోలేకపోతున్నారు. వారు తమ ఇష్టానుసారంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం.. అటు తర్వాత వారు నచ్చకపోతే విడిపోవడం చాలా ఈజీ అయిపోయింది. పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేసి మరొకరితో సహజీవనం చేస్తూ జీవితాలను చిందరవందర చేసుకుంటున్నారు. భారతీయుల పెళ్లిళ్లకి విదేశాలలో పెళ్లిళ్లకి చాలా తేడా ఉంది. అయితే తాజాగా ఓ యూఎస్ మహిళ వింత ప్రకటన చేసింది. ఆ ప్రకటనేంటో.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
యూఎస్ కి చెందిన ఈవ్ టిల్లే కౌల్సర్(35) తనకు పెళ్లి చేసుకునేందుకు వరుడు కావాలని ప్రకటన చేసింది. ఆమెకు సరైన పెళ్లి కొడుకును వెతికితే 5000 డాలర్టు (రూ.4.10 లక్షలు) ఇస్తానని ప్రకటించింది. కొన్ని కండీషన్స్ కూడా పెట్టింది. అతనితో తను ఎక్కువకాలం ఉండలేనని, 20 సంవత్సరాల్లో విడాకులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. తను ఐదు సంవత్సరాలనుండి డేటింగ్ యాప్స్‌తో ట్రై చేసినప్పటికీ ఎవరితో సెట్ అవలేదు. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ప్రకటన కాస్త వైరల్‌గా మారింది.
అయితే ఈవ్ టిల్లే కౌల్సర్ ఇందులో కొన్ని కండీషన్స్ కూడా పెట్టింది. తనకు వరుడిని పరిచయం చేసివారికి భారీగా రిఫరల్ బోనస్ అందిస్తానంటుంది.
వివాహ ధృవీకరణ పత్రంపై సంతకం చేసిన వెంటనే 5 వేల డాలర్లు పొందవచ్చని.. అతనికి రెండో భార్యగా తను కాకూడదని చెప్పింది. వరుడి వయస్సు 27 నుండి 40 సంవత్సారాల మధ్య ఉండాలని.. 5 అడుగుల 11 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ హైట్ కలిగి ఉండాలని వివరించింది. క్రీడల పట్ల,పిల్లల పట్ల, జంతువుల పట్ల అనుబంధాలను కలిగి ఉండాలని కోరుతోంది. ప్రస్తుతం ఈవ్ టిల్లే ప్రకటన నట్టింట వైరల్ అవుతోంది.
దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.