ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్నారుల స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతుంటారు. ఈకాలం పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు సవాళ్లు గా మారింది. ప్రతి దాన్ని స్పీడ్ గా క్యాచ్ చేసేస్తారు. ఏ విషయంలోనైన ప్రశ్నించేందుకు భయపడరు. ఇక దారుణమైన విషయం ఏమిటంటే..కొందరు పిల్లలకు పెద్దల పట్ల ఎలా గౌరవంగా నడుచుకోవాలో తెలియడం లేదు. దేశ భక్తి, దేశం కోసం పోరాడే సైనికుల పట్ల భక్తి భావాలు తెలియడం లేదు. పైగా అమ్మనాన్నలు చెప్పినా.. పెద్దగా వినిపించుకోరూ, పాటించరు. కానీ ఓ చిన్నారి చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతి ఒక్కరి మనస్సు హత్తుకునేలా ఆ చిన్నారి చేసింది. దేశ రక్షణ ప్రాణాలు సైతం లెక్క చేయడకుండా విధులు నిర్వహిస్తున్న జవాన్ కాళ్లకు ఈ చిన్నారి నమష్కరించింది. దీంతో నెటిజన్లు ఆ చిట్టి తల్లిని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతం చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో ఓ మెట్రో రైల్వేస్టేషన్ లో కొందరు ఆర్మీ జవాన్లు నిల్చోని ఉన్నారు. వారి వద్దకు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఓ చిన్నారి.. తన బుడి బుడి అడుగులతో వాళ్ల వద్దకు వెళ్లింది. అక్కడ చూస్తున్న వారికి మొదట అర్ధం కాలేదు. ఆ సైనికులకు కూడా అర్ధం కాలేదు.. ఆ చిన్నారి ఎందుకు తమ వద్దకు వస్తుందని. అయితే వారి దగ్గరికి వెళ్లిన చిన్నారి సైనికుడి కాళ్ల తాకి పాదాభివందనం చేసింది. దీంతో అక్కడ ఉన్న జవాన్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆమెను దగ్గరకు తీసుకుని మెచ్చుకోలుగా కాసేపు మాట్లాడతారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Raising patriotic young minds is a duty every parent owes to this great nation.
Jai Hind 🇮🇳 pic.twitter.com/mhAjLbtOvG
— P C Mohan (@PCMohanMP) July 15, 2022
ఇదీ చదవండి: Vidoe: చనిపోయాడు అనుకున్న వ్యక్తికి.. CPR చేసి ప్రాణాలు నిలిపిన పోలీస్.. నెటిజన్ల ప్రశంసలు!
ఇదీ చదవండి:వైరల్ వీడియో: ఇదేం గొడవ రా బాబు!.. ప్రియుడి కోసం యువతుల స్ట్రీట్ ఫైట్!
ఇదీ చదవండి: Video: సోషల్ మీడియాలో మునిగిపోయిన కోతులు..