ఈ మధ్య కాలంలో ఫోన్ లేని వ్యక్తి కనిపించడం చాలా అరుదు. మెుబైల్ లేనిది చాలా మంది అసలు ఉండలేరు. మనిషి జీవితంలో ఫోన్ ఓ భాగం అయిపోయింది. ఇక చెప్పాలంటే..మన శరీరంలో అది ఓ భాగంగా మారిపోయింది. కొందరు మొబైల్ కు బానిస అయిపోతున్నారు. చివరకి ఈ అలవాటు మనుషులకే కాకుండా జంతువులకు కూడా సోకింది. గతంలో సెల్ ఫోన్ చూస్తున్న కొన్ని జంతువుల వీడియో వైరల్ తెగ వైరల్ అయ్యాయి. తాజాగా కొన్ని కోతులు మనుషుల్లాగే ఫోన్ చూడటం, ఆపరేట్ చేయడం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోల ఓ వ్యక్తి తన మొబైల్ ను కోతుల ముండు ఉంచాడు. దానిలో ముందే ఓపెన్ చేసి ఉన్న సోషల్ మీడియా పోస్టులను కోతులు చూస్తున్నాయి. ఓ పెద్ద కోతి మరిన్ని పోస్టుల కోసం మొబైల్ ను స్కోల్స్ చేస్తూ..పక్కన ఉన్న పిల్ల కోతులకు చూపిస్తుంది. వెనుక నుంచి చిన్న కోతి దాన్ని పిలుస్తుండటంతో అన్యమనస్కంగానే వెనుతిరిగింది. ఈ పోస్టును షేర్ చేసి "క్రేజ్ ఆఫ్ సోషల్ మీడియా" అని పోస్టు చేశారు. స్మార్ట్‌ఫోన్ పై కోతులకు ఉన్న ఆసక్తిని చూసి చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతుండగా ఈ వీడియో ఇంటర్నెట్‌లో నెటిజన్లను విస్మయపరిచింది. మనుషులే కోతులకు ఇవన్నీ నేర్పించి, నిజంగానే "రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్" చేస్తారేమో అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో సోషల్ మీడియానా మజాకా అంటున్నారు. మనుషులు చెడిపోయింది కాక, కోతులను కూడా చెడగొట్టేస్తున్నారని మరికొందరు జోకులు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Craze Of Social Media♀️♀️ pic.twitter.com/UiLboQLD32 — Queen Of Himachal (@himachal_queen) July 10, 2022 ఇదీ చదవండి: Viral Video: గంగానదిలో 3 కి.మీ.లు ఈదిన ఏనుగు! ఇదీ చదవండి: వైరల్ వీడియో: బూటులోంచి బుసల కొడుతూ పైకి లేచిన నాగుపాము