సాధారణంగా మనకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ వద్దకు వెళ్తాం. వారు చక్కగా మన ఆరోగ్య సమస్య గురించి అడిగి తెలుసుకుంటారు. మనం ఎన్ని ఆరోగ్యానికి సంబంధించి సందేహాలు అడిగిన ఓపికగా సమాధానాలు చెప్తుంటారు. కానీ కొందరు డాక్టర్లకు చిన్న విషయాలకు కూడా కోప పడుతుంటారు. మరి కొందరు వైద్యులైతే పేషెంట్ ను కొట్టినంత పని కూడా చేస్తారు. తాజాగా ఓ వైద్యుడు కడుపు నొప్పితో వచ్చిన రోగిని కర్రతో చావబాదాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సదరు పేషట్ అక్కడి నుంచి పరుగు తీశాడు. మరి.. ఎందుకు ఆ వైద్యుడు రోగిని అంతలా కొట్టాడు అనే కదా మీ సందేహం. అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒడిశాలోని కలహండిలో ముఖేష్ నాయక్ అనే వ్యక్తికి రాత్రి పూట కడుపు నొప్పి వచ్చింది. దీంతో అతను దగ్గర్లోని ధర్మఘర్ ఆసుపత్రికి వెళ్లాడు. కానీ, అక్కడ డాక్టర్లు ఎవరూ లేరు. నర్సులే వచ్చి అతడిని బెడ్ మీద పడుకోబెట్టి ఇంజెక్షన్ చేశారు. చికిత్స తీసుకున్న చాలా సేపటికి కూడా అతనికి కడుపునొప్పి తగ్గలేదు. దీంతో ఆసుపత్రిలో డాక్టర్లు ఎందుకు లేరని ప్రశ్నించాడు ముఖేష్. అందుకు సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన నర్సులు డాక్టర్‌కు ఫోన్ చేశారు. దీంతో పరుగు పరుగున ఆసుపత్రికి వచ్చాడు డాక్టర్. అందరూ వైద్యం చేస్తాడులే అనుకున్నారు. కానీ కర్ర తీసుకుని పేషంట్‌ను కొట్టడం మొదలు పెట్టాడు.
ఒక్కసారిగా షాక్ అయిన అతను పరుగులు తీశాడు. అతని వెంట డాక్టర్ కూడా కర్ర పట్టుకుని పరుగు తీశాడు. డాక్టర్ లేడు ఏంటని ప్రశ్నించినందుకు ఇంత పని చేశాడు ఆ వైద్యుడు. ప్రాణాలు కాపాడాల్సిన వాళ్లే ఇలా కోపంతో ఊగిపోతే ఎలా అని నెటిజన్లు ఫైర్ అతున్నారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని డాక్టర్, సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డరర్‌తో సమానం. అర్జున్ రెడ్డి సినిమాలోని ఈ డైలాగ్‌ను రియల్ లైఫ్‌లో చేసి చూపించాడు ఈ వైద్యుడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.